నన్నడగొద్దు ప్లీజ్‌

Love doctor Priyadarshini Ram - Sakshi

అన్నయ్యా.. చాలా పెద్ద ప్రాబ్లమ్‌..! నేను ఒక అమ్మాయిని లవ్‌ చేశాను. తను నాకు ఏడేళ్లుగా తెలుసు. మూడేళ్ల నుంచి లవ్‌ చేసుకుంటున్నాం. తను చాలా మంచిది. నన్ను బాగా చూసుకునేది. నాతో లవ్‌లో ఉంటూనే తన ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడేది. ఫ్రెండ్‌గా మాట్లాడుతుంటే నేను మొదట్లో వద్దని చెప్పలేదు. కానీ తర్వాత వాళ్లు లిమిట్స్‌ క్రాస్‌ చేశారు. దాంతో మాట్లాడొద్దని చెప్పాను. వినలేదు. పైగా ‘కేవలం ఫ్రెండ్‌గానే మాట్లాడుతున్నా’ అనేది. అడ్జెస్ట్‌ అవడానికి చాలా ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. అదే కారణంగా మా మధ్య చాలా గొడవలు జరిగాయి. ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. అయినా ఆ అమ్మాయి ‘నీకంటే వాడే ఎక్కువ’ అంది. అప్పుడు పేరెంట్స్‌ కోసం ఆలోచించాను. తనని మరిచిపోవాలని నిర్ణయించుకున్నాను. అయితే కొన్నిరోజులకి ఆ అమ్మాయి వాళ్ల కజిన్‌ నాకు మెసేజ్‌ చేసింది. మా బ్రేకప్‌ తర్వాత వాళ్లిద్దరూ కలిసి హ్యాపీగా ఉన్నారట. నాకు వాళ్లు హ్యాపీగా ఉండటం నచ్చలేదన్నయ్యా. అందుకే ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్‌ చేశాను. ఇప్పుడు మళ్లీ తను నాతో లవ్‌లో ఉంది. నేను చేసింది కరెక్టా? రాంగా? చెప్పండి అన్నయ్యా..!? – విజయ్‌

ఎందుకిలా అయిపోయావు బ్రో...??? నీకు సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఉండాలి..! ఉంది కూడా..!! కానీ కొంచెం మైండ్‌ దొబ్బింది...! లవ్‌ వల్ల మైండ్‌ రాంగ్‌ డైరెక్షన్‌లో మూవ్‌ అవుతోంది..! నువ్వు లైఫ్‌ కంటే ఎక్కువగా ప్రేమించావు..! అయినా అమ్మాయి రెస్పాండ్‌ కాలేదు..!! అదర్‌సైడ్‌ లవ్‌ కంటిన్యూ చేసింది..!! అప్పుడైనా విషయం అర్థం చేసుకుని ఈ లవ్‌ నుంచి ఎగ్జిట్‌ రూట్‌ కొట్టాల్సింది. కానీ రాంగ్‌ రూట్‌ తీసుకున్నావు.. అమ్మాయి మీద ప్రెజర్‌ పెట్టి లాగుతున్నావు. మొత్తం పెంట పెంట చేసుకుంటున్నావు..!! లవ్‌ నేచురల్‌గా ఉండాలి. ఫోర్స్‌డ్‌గా ఉండకూడదు..!! అలాంటి లవ్‌ నిలవదు..!! నీ లవ్‌ గ్రేట్‌..! దాన్ని షిట్‌ చేసుకోవద్దు..!! వదిలేసెయ్యి.. బీ ఎ హీరో. మైండ్‌ క్లియర్‌ చేసుకో...! లివ్‌ న్యూ లైఫ్‌.. అప్పుడు నువ్వే విజయ్‌..! నీదే విజయం..!! ‘కరెక్ట్‌గా చెప్పారు సార్‌..!! ఈ అడ్వయిజ్‌ ఫాలో అయిపో.. ఇదే నీకు బెస్ట్‌ రూట్‌ విజయ్‌!!’

- ప్రియదర్శిని రామ్‌

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top