నన్నడగొద్దు ప్లీజ్‌

love doctor priyadarshini ram - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేను నెల రోజుల నుంచి ఒకరిని లవ్‌ చేస్తున్నాను. తనకి కూడా నేనంటే ఇష్టమే. కానీ తనని వేరే అమ్మాయి కూడా లవ్‌ చేస్తోంది. ఆ అమ్మాయి ప్రపోజ్‌ చేస్తే తను ఓకే చేశాడట. ఆ విషయం వాళ్ల చాటింగ్‌ చూసేదాకా తెలియలేదు. తర్వాత తనని నేను నిలదీస్తే ‘నేను ఆ అమ్మాయితో జోక్‌ చేశాను. నాకు నువ్వంటేనే ఇష్టం’ అంటున్నాడు. ఏం చెయ్యాలి అన్నయ్యా? నేనంటే ఇష్టముంటే వేరే అమ్మాయితో.. ‘ఐ వాంట్‌ యు, ఐ కిస్‌ యు’ అని మెసేజ్‌లు చెయ్యగలడా..? చెప్పండి అన్నయ్యా..! ఇప్పుడు నేను ఏం చెయ్యాలో మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌! – కిరణ్‌ జ్యోతి

ఆ రెండో అమ్మాయి ఫోన్‌ నంబర్‌ సంపాదించు! ‘మీరు మేధావి సార్‌!’ ఎందుకు నీలూ??? ‘మీరు అనుకుంటున్నది నాకు అర్థమైపోయింది సార్‌!’ వాట్‌ ఈజ్‌ దట్‌ నీలూ? ‘చిలిపి! నాకు తెలుసు సార్‌..!! మీరు కిరణ్‌ జ్యోతికి ఏం చెప్పబోతున్నారో నాకు అర్థమైపోయింది సార్‌!!!’ అయితే.. నేను చెప్పాలనుకున్నది కిరణ్‌ జ్యోతికి కూడా తెలిసిపోయిందంటావా నీలూ??? ‘పక్కా సార్‌! ఆఫ్టరా ఆల్‌ కిరణ్‌ మీ సిస్టర్‌ కదా సార్‌! మీరు ఉప్పందిస్తే మొత్తం అర్థం చేసేసుకుని ఉంటుంది సార్‌!!’ అయితే ఇంకో లెటర్‌ తియ్యి..! ఎందుకు టైమ్‌ వేస్ట్‌ చెయ్యడం?!??!? ‘అది కాదు సార్‌..! మీ మనస్సులో ఉన్న ఆన్సర్‌ కరెక్ట్‌గా గెస్‌ చేసిన థ్రిల్‌ ఉండాలి కదా సార్‌..! చెప్పండి!! చెప్పండి ప్లీజ్‌ సార్‌!!!!’ నువ్వే చెప్పు నీలూ!! ‘కిరణ్‌..! ఆ రెండో అమ్మాయి ఫోన్‌ నంబర్‌ కనిపెట్టి.. ‘ఐ వాంట్‌ టు మీట్‌ యు’ అని, ఆ వెధవ ఫోన్‌ నుంచి ఆ సెకండ్‌ లవర్‌కి మెసేజ్‌ పెట్టు..! కలిసి ఈ డబుల్‌ స్టాండర్డ్డ్, డబుల్‌ క్రాస్, డబుల్‌ చీటర్, డబుల్‌ టైమర్, డబుల్‌ డర్టీఫెలో స్టోరీ చెప్పు!! ఇద్దరూ కలిసి వాడ్ని డబుల్‌ డిష్యూం చెయ్యండి? కరెక్టేనా సార్‌!!?’ అబ్బబ్బబ్బబ్బబ్బా...! నువ్వు, కిరణ్‌ ఇద్దరూ డబుల్‌ స్మార్ట్‌!!!

- ప్రియదర్శిని రామ్‌ , లవ్‌ డాక్టర్‌

 

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top