నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor Priyadarshini Ram | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Jul 16 2018 12:24 AM | Updated on Jul 16 2018 12:24 AM

love doctor Priyadarshini Ram - Sakshi

హాయ్‌ సార్‌! నేనొక అమ్మాయిని మూడేళ్లుగా లవ్‌ చేస్తున్నాను. అమ్మాయి కూడా నన్ను లవ్‌ చేసింది. కానీ ఇప్పుడు క్యాస్ట్‌ వేరే అని నన్ను వద్దంటోంది. ‘సేమ్‌ క్యాస్ట్‌ అయితే నువ్వు వద్దన్నా నీ దగ్గరికి వచ్చేదాన్ని’ అంటోంది. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో లవ్‌లో ఉందని నాకు తెలిసింది. తనని అదే అడిగాను. తను ‘ఆ అబ్బాయి నా క్లాస్‌మేట్‌’ అంటోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెప్పండి భయ్యా ప్లీజ్‌..! – లోకేశ్‌

ప్రేమలో క్యాస్ట్‌ భేదాలు అస్సలు ఉండవు లోకేశ్‌! ‘మరి మీ సిస్టర్‌ అబద్ధాలు చెబుతోందా సార్‌?’ నిజం చెబుతోంది నీలాంబరి! ‘అంటే మీరు అబద్ధం చెబుతున్నారా సార్‌?’ నేనూ నిజమే చెబుతున్నా! ‘ఏంటి సార్‌? అమ్మాయి నీ క్యాస్ట్‌ నా క్యాస్ట్‌ సేమ్‌ కాదు. సో నో మ్యారేజ్‌ అని చెబుతోంది. మీరేమో లవ్‌కి క్యాస్ట్‌ భేదాలు ఉండవని చెబుతున్నారు. అలా అయితే మీరైనా, మీ సిస్టర్‌ అయినా అబద్ధం చెబుతున్నట్లే కదా సార్‌!?’ నీలూ.. నేనేమన్నాను. లవ్వుకు క్యాస్ట్‌ అడ్డం రాదు అన్నాను! ‘కరెక్ట్‌ సార్‌!’ సిస్టర్‌ ఏమంది? క్యాస్ట్‌ వేరే అయితే కుదరదు అంది.

‘కరెక్ట్‌ సార్‌!’ మరి కన్ఫ్యూజన్‌ ఏముంది? ‘సార్‌....! అమ్మాయి నీ క్యాస్ట్‌ నా క్యాస్ట్‌ సేమ్‌ కాదు. సో నో మ్యారేజ్‌ అని చెబుతోంది. మీరేమో లవ్‌కి క్యాస్ట్‌ భేదాలు ఉండవని చెబుతున్నారు. అలా అయితే మీరైనా, మీ సిస్టర్‌ అయినా అబద్ధం చెబుతున్నట్లే కదా సార్‌!?’ అంటే నా సిస్టర్‌ ఈ లోకేశ్‌ని అంతగా లవ్‌ చెయ్యడం లేదన్నమాట. ప్రేమించే వాళ్లు ఎక్కడైనా.. ఆస్తి, నేపథ్యాలు, సాంప్రదాయాలు, సంపాదనలు.. మాట్లాడుకుంటారా నీలూ? ‘తిప్పి తిప్పి చెప్పినా కరెక్ట్‌గా చెప్పారు సార్‌. లోకేశ్‌ని అంతగా లవ్‌ చేస్తే పెళ్లికి ఏదీ అడ్డం వచ్చేది కాదు. ప్రేమ అంతగా లేదు కాబట్టే.. అన్ని ఎక్స్‌క్యూజెస్‌ కదా సార్‌!’ అబ్బబ్బబ్బబ్బబ్బా.... నీలూ. యు ఆర్‌ సో స్మార్ట్‌!!!

Advertisement
 
Advertisement
Advertisement