నన్నడగొద్దు ప్లీజ్‌

Love doctor priyadarshini ram - Sakshi

హాయ్‌ సార్‌..! నేనొక అమ్మాయిని త్రీ ఇయర్స్‌గా ప్రేమిస్తున్నా. కానీ ఇప్పటివరకూ ఆ అమ్మాయితో మాట్లాడలేదు. నేను ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి తెలుసు. ఒక్కరోజు కూడా తనని చూడకుండా ఉండలేను. వీలు చూసుకుని మాట్లాడదామనుకుంటే.. ఎప్పుడూ తను వాళ్ల పేరెంట్స్‌తోనే ఉంటోంది. ఆమె నన్ను ప్రేమిస్తోందో లేదో ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు సార్‌. ఒకవేళ తను కాదంటే నేను తట్టుకోలేను సార్‌. ప్లీజ్‌ మంచి సలహా ఇవ్వండి సార్‌! – నరేష్‌

నేనూ తట్టుకోలేను... ‘మీరేంటి సార్‌ తట్టుకోలేనిది??’ నో చెబితే... ‘అంటే ఇప్పటి దాకా మీకు ఎవరూ.. ఎప్పుడూ... నో చెప్పలేదా సార్‌?’ చెప్పే ఉంటారు నీలూ..! ‘మరి అప్పుడు తట్టుకున్నారు కదా!?!’ అప్పుడెప్పుడో కదా..! ‘అంటే అప్పుడు యంగ్‌ కాబట్టి తట్టుకోగలిగారు కదా సార్‌!!’ అబ్బబ్బబ్బబ్బా.... నీలూ నువ్వు ఎంత స్మార్ట్‌..! ‘అదే ఇప్పుడు ఎవరైనా ‘నో’ చెబితే మీసాలకు రంగు వేయడం మానేసి సన్యాసం పుచ్చుకుంటారు కదా సార్‌!’ అంత వెటకారం ఎందుకులే నీలూ.. అప్పుడు యంగ్‌ కాబట్టి కనబడిందల్లా కావాలనిపించేది.. నో అని చెప్పినా.. ఇంకొకటి ట్రై చేసుకునేవాడిని. ‘ఓహో... ఓహో... ఓహోహో.... నరేష్‌ ఇంకా యంగ్‌ కాబట్టి... ఇష్టపడడంలో తప్పు లేదు కానీ కుదరకపోతే వేరే ట్రై చేసుకోవాలని కదా సార్‌ మీ ఐడియా..?’ అబ్బబ్బబ్బబ్బా... నీలూ నువ్వు ఎంత అబ్బబ్బబ్బబ్బా....

- ప్రియదర్శిని రామ్‌
 

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top