నన్నడగొద్దు ప్లీజ్‌ | Love doctor priyadarshini ram | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Jun 4 2018 12:15 AM | Updated on Jun 4 2018 12:19 AM

Love doctor priyadarshini ram - Sakshi

హాయ్‌ రామ్‌ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని లవ్‌ చేస్తున్నా. తనంటే నాకు చాలా ఇష్టం. బట్‌ ఈ విషయం ఇప్పటిదాకా తనకి చెప్పలేదు. అయితే కాలేజ్‌ లాస్ట్‌ డే ప్రపోజ్‌ చేద్దామంటే, నా క్లాస్‌మెట్‌ అంతా చెడగొట్టాడు. అసలు ప్రపోజ్‌ చేస్తే ఎలా రియాక్ట్‌ అవుతుందోనని చాలా భయంగా ఉంది. నా లవ్‌ని తనకి ఎలా ఎక్స్‌ప్రెస్‌ చెయ్యాలో ఒక ఐడియా ఇవ్వండి ప్లీజ్‌. – కేశవ్‌

సాక్షి పేపర్లో వచ్చిన నీ క్వశ్చన్‌... దానికి ఇప్పుడు నీలాంబరి ఇచ్చే ఆన్సర్‌ని ఆ అమ్మాయికి చూపించు...! ‘ఆన్సర్‌ నేను ఇవ్వాలా సార్‌? మీరు అరటిపండు తింటారా సార్‌? బాగుంది.. పేపర్లో కాలమ్‌ మీది, కష్టం నాదా సార్‌? ఇలా మీరు నన్ను ఎక్స్‌ప్లాయిట్‌ చెయ్యడం ఏం బాగోలేదు సార్‌!’ ఇలా భయపెడితే ఎలా నీలాంబరి.. ముందే నాది వీక్‌ హార్ట్‌! ‘అమ్మాయిలంటే ఆ మాత్రం భయం ఉండాలి సార్‌..!’ భయంతో కూడిన గౌరవంతో కూడిన... నమ్మకంతో కూడిన... అభిమానంతోనే అడుగుతున్నా నీలూ! ‘అదే పని కేశవ్‌ని కూడా చెయ్యమనండి సార్‌. ఆ అమ్మాయిని గౌరవంతో కూడిన, నమ్మకంతో కూడిన, అభిమానంతో రిక్వెస్ట్‌ చేసుకోమనండి సార్‌!’


- ప్రియదర్శిని రామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement