
- అవిరామ పదం పేరుతో వాడ్రేవు చినవీరభద్రుడు తన సాహిత్య ప్రయాణం గురించి జూన్ 9న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మాట్లాడనున్నారు. వేదిక: ప్రెస్ క్లబ్, సోమాజిగూడ. నిర్వహణ: భద్రుడి మిత్రులు, పాఠకులు.
- పెద్దన్న సూరాబత్తుల రాసిన అనగనగా సీతారాం పుస్తక ఆవిష్కరణ జూన్ 9న సా. 6 గంటలకు బుక్ ఫెయిర్, పెవెలియన్ గ్రౌండ్, ఖమ్మంలో జరగ నుంది. నిర్వహణ: రోజానా ప్రచురణలు.
- ముకుంద రామారావు అనువదించిన చర్యా పదాలు పరిచయ సభ జూన్ 9న సా.6 గం.కు హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో జరగనుంది. నిర్వహణ: ఛాయ.
- డాక్టర్ సి.నారాయణరెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా సినారె సాహిత్య సమాలోచన జూన్ 9న ఉ.10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. నిర్వహణ: తెలంగాణ సాహితి.
- కవిసంధ్య, మధునాపంతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో– వేసవి కవితా శిబిరం జూన్ 8, 9 తేదీల్లో పల్లిపాలెం ఫౌండేషన్ స్కూలు ఆడిటోరియంలో జరగనుంది. సమన్వయం: మధునాపంతుల, ఎం.వి. చలపతి, దాట్ల దేవదానం రాజు, శిఖామణి.
- రాపోలు సీతారామరాజు ‘దక్షిణాఫ్రికా నానీలు’ ఆవిష్కరణ జూన్ 5న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్.గోపి. నిర్వహణ: తేజ ఆర్ట్ క్రియేషన్స్.
- మణిపూసల కవితా ప్రక్రియలో రాసిన 25 పుస్తకాల ఆవిష్కరణ జూన్ 9న ఉ. 10 గం.కు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ముఖ్య అతిథి: అల్లం నారాయణ. నిర్వహణ: కాగ్నా కళా సమితి.