లేట్ లెగ్గింగ్స్‌తో లేటెస్టుగా..! | Late leggingsto the latest ..! | Sakshi
Sakshi News home page

లేట్ లెగ్గింగ్స్‌తో లేటెస్టుగా..!

Feb 11 2016 10:58 PM | Updated on Sep 3 2017 5:26 PM

లేట్ లెగ్గింగ్స్‌తో లేటెస్టుగా..!

లేట్ లెగ్గింగ్స్‌తో లేటెస్టుగా..!

మహిళల రోజూవారీ వస్త్రధారణలో లెగ్గింగ్ అనేది ఇప్పుడు సాధారణమైపోయింది.

రీయూజ్
 
మహిళల రోజూవారీ వస్త్రధారణలో లెగ్గింగ్ అనేది ఇప్పుడు సాధారణమైపోయింది. కొన్ని లెగ్గింగ్స్ బిగుతైపోయినా, రంగు మారినా పక్కన పడేయడం మామూలే. ఇలాంటి వాటిని కూడా వాడుకలోకి తీసుకురావడం ఎలాగో తెలుసుకుందాం.
 
క్రాప్‌టాప్

లెగ్గింగ్ అంటే బాటమ్‌గా కాళ్లకు వాడేదే అనుకుంటాం. కానీ దీనినే ఓ చిన్న మార్పుతో మిడీస్ మీదకు క్రాప్ టాప్‌గా మార్చేయవచ్చు. లెగ్గింగ్‌ను తిరగేసి, మధ్య భాగంలో నెక్‌సైజ్‌ను కట్ చేస్తే చాలు ధరించడానికి క్రాప్‌టాప్ రెడీ.
 
టై అండ్ డై
లెగ్గింగ్స్ రంగు వెలసిపోతే త్వరగా మూలన పడేయాల్సిందే. ఇలాంటి వాటిని టై అండ్ డై చేసి కొత్తవాటిలా మార్చేసుకోవచ్చు. నచ్చిన 2-3 డై కలర్స్‌ను ఎంచుకోవాలి. ప్యాటర్న్స్ బట్టి రకరకాలుగా ముడులు వేసుకోవచ్చు. ప్రతి ముడిలో ఒక చిన్న బాల్ ఉంచి, దాని చుట్టూ రబ్బర్ బ్యాండ్‌తో గట్టిగా ముడి వేసి, రంగులో ముంచి, ఆరవేయాలి. కొత్తరకం డిజైన్‌తో లెగ్గింగ్ మరో రూపు దాల్చుతుంది. కొత్తటాప్‌కు సరికొత్తగా మ్యాచ్ అయ్యేలా  లెగ్గింగ్‌ను మీరే తయారుచేసుకోవచ్చు. డై కలర్‌లో కప్పు ఉప్పు లేదా వెనిగర్ కలిపితే క్లాత్‌కి రంగు బాగా పడుతుంది.
 
క్యూట్ టీ షర్ట్
స్లీవ్‌లెస్, ఫ్రిల్స్ షార్ట్ స్లీవ్స్ టీ షర్ట్‌ను కాంట్రాస్ట్ లెగ్గింగ్‌ను వాడితే ఇలా అందమైన మరో స్టైల్ షర్ట్ రెడీ అవుతుంది. షర్ట్ ముందు భాగంలో అదే లెగ్గింగ్ క్లాత్‌తో కుచ్చులు పెట్టి కుట్టవచ్చు.
 
అందమైన చేతులకు గ్లౌజ్
బయట ఎక్కువ తిరిగేవారు ఎండ, కాలుష్యం బారిన పడకుండా చేతులకు గ్లౌజ్ ధరించాలనుకుంటే లెగ్గింగ్‌నే చిన్న చిన్న మార్పులు చేసుకొని ఇలా గ్లౌజ్‌లుగా వాడుకోవచ్చు. ఇంట్లో పుస్తకాల అల్మరా, ఎలక్ట్రానిక్ వస్తువులపై దుమ్ము తుడవడం వంటి సమయాల్లోనూ ఈ గ్లౌజ్‌లను ఉపయోగించుకోవచ్చు. దీంట్లోనే లాంగ్/షార్ట్ గ్లౌజ్‌లను కూడా తయారుచేసుకోవచ్చు. లెగ్గింగ్‌ను సగానికి కట్ చేసి, పిల్లలకు షార్ట్స్‌గానూ ఉపయోగించవచ్చు.

Advertisement
Advertisement