కొవ్వులకు చెక్‌పెట్టే కొర్రలు | Korralu check for fats | Sakshi
Sakshi News home page

కొవ్వులకు చెక్‌పెట్టే కొర్రలు

Aug 14 2018 12:04 AM | Updated on Aug 14 2018 12:04 AM

Korralu  check for fats - Sakshi

ఇటీవల చాలామంది ఆరోగ్యం కోసం కొర్రలను వాడుతున్నారు. మంచి ఆరోగ్యంతో ఇవ్వడంతోపాటు బరువును నియంత్రణలో ఉంచుకోడానికి కొర్రలు బాగా ఉపయోగపడతున్నందువల్ల వాటితో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. కొర్రల్లో తక్కువ కార్బోహైడ్రేట్లతో పాటు ఎక్కువగా పీచు ఉండటం వల్ల అవి శరీరంలోకి తేలిగ్గా ఇంకడంతో పాటు చక్కెరను చాలా తక్కువగా విడుదలయ్యేలా చేస్తాయి. తద్వారా డయాబెటిస్‌ రాకుండా నివారిస్తాయి. అంతేకాదు... ఒకవేళ  డయాబెటిస్‌ ఉన్నవారు వాటిని వాడినా చక్కెర చాలా ఆలస్యంగా వెలువడతుంది కాబట్టి కొర్రలు వారికి మంచి ఆహారం. వీటిల్లోని పీచు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  కొర్రలలో కొవ్వులు చాలా తక్కువ కావడంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. కొర్రలు స్థూలకాయాన్ని నివారిస్తాయి. బరువును తగ్గించేందుకు తోడ్పడతాయి.  కొర్రలలోని అమైనో యాసిడ్స్‌ దెబ్బతిన్న కణాలను రిపేర్‌ చేసి, వాటిని మళ్లీ పుంజుకునేలా చేస్తాయి.

చర్మంతో పాటు ఇతర కణాలను మళ్లీ ఆరోగ్యవంతం చేసే ఈ గుణం కారణంగా ఏజింగ్‌ ప్రక్రియను ఆలస్యం చేసి, దీర్ఘకాలం యౌవనంగా ఉంచడానికి తోడ్పడతాయి.  పాలిచ్చే తల్లులు వీటిని తీసుకుంటే మరిన్ని పాలు పడేలా చేస్తాయి. కొర్రల్లో బి1, బి2, బి5, బి6, విటమిన్‌–ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిలో ఫాస్ఫరస్‌ ఎక్కువ కావడంతో ఎముకలను బలంగా ఉంచుతాయి. పొటాషియమ్‌ పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తాయి.  మెగ్నీషియమ్, ఐరన్, జింక్‌ కారణంగా జుట్టుతో పాటు పాటు చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement