ఫ్యాటీలివర్... | homeopathic treatment for fatty liver disease | Sakshi
Sakshi News home page

ఫ్యాటీలివర్...

Nov 19 2013 12:05 AM | Updated on Sep 2 2017 12:44 AM

ఫ్యాటీలివర్...

ఫ్యాటీలివర్...

కాలేయంలో కొవ్వుపదార్థాలు పేరుకుపోయి, దాని పరిమాణం కూడా పెరగడాన్ని ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ముందుగా ఏ లక్షణాలు బయటపడకపోయినా...

కాలేయంలో కొవ్వుపదార్థాలు పేరుకుపోయి, దాని పరిమాణం కూడా పెరగడాన్ని  ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ముందుగా ఏ లక్షణాలు బయటపడకపోయినా, యథాలాపంగా ఏవైనా ఆరోగ్యపరీక్షలు చేయిస్తున్నప్పుడు ఇది బయటపడవచ్చు.
 
 కారణాలు
 అధిక బరువు  
 శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరడం  
 శారీరక శ్రమ తక్కువగా ఉండే జీవనశైలి లేదా ఒకేచోట స్థిరంగా కూర్చుని పనిచేసే వృత్తిలో ఉండటం  
 మత్తుపానీయాలు తాగడం  
 డయాబెటిస్... ఈ పరిస్థితుల్లో తనలోకి చేరుకునే అధిక కొవ్వును కాలేయం నియంత్రించలేదు. దాంతో కాలేయంలోని కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. ఫలితంగా కాలేయం సామర్థ్యం తగ్గడం, వాపురావడం, గట్టిదనం రావడం జరగవచ్చు.
 
 నిర్ధారణ పరీక్షలు
 పూర్తి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ)  
 కాలేయ పనితీరు పరీక్ష (లివర్ ఫంక్షన్ టెస్ట్-ఎల్‌ఎఫ్‌టీ)  
 సీటీ లివర్
 అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్
 లివర్ బయాప్సీ
 లిపిడ్ ప్రొఫైల్  
 ఎఫ్‌బీఎస్, పీఎల్‌బీఎస్, ఆర్‌బీఎస్ వంటి పరీక్షలు.
 
 నివారణ
 బరువు పెరగకుండా చూసుకోవడం  
 వ్యాయామం చేయడం  
 పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఆహారంలో కొవ్వులు తగ్గించడం.
 
 చికిత్స :  
 దీనికి ప్రత్యేకంగా మందులు ఏమీ ఉండవు. అయితే వ్యాధి వచ్చిన కారణాన్ని కనుగొని ఆ పరిస్థితిని నివారించేలా చికిత్స చేయడం వల్ల ఈ కండిషన్ తగ్గే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ సమస్య కొద్దిగానే ఉంటే దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే దీర్ఘకాలంగా ఉంటే అది ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి కండిషన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది. లక్షణాలను బట్టి ఈ కండిషన్‌కు కార్డస్ మరైనస్, చెలిడోనియమ్, సియోనాంథస్, లైకోపోడియమ్, కాల్కేరియా కార్బ్, మెర్క్‌సాల్, మాగ్‌మూర్, నక్స్‌వామికా, ఫాస్ఫరస్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది.
 
 డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్

 

Advertisement
 
Advertisement
Advertisement