కాలీఫ్లవర్‌తో క్యాన్సర్లు దూరం...

Health benefits with calf liver - Sakshi

గుడ్‌ పుడ్‌

కాలిఫ్లవర్‌తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. గోబీ పువ్వు అని మనం పిలుచుకునే కాలీఫ్లవర్‌ క్యాన్సర్లను దూరంగా తరిమేస్తుంది. దానితో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే.మహిళల ఆరోగ్య నిర్వహణకు కాలిఫ్లవర్‌ బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే ఇది  హార్మోన్ల సమతౌల్యతను కలిగించడంలో మేటి.కాలిఫ్లవర్‌ అలర్జీల పాలిటి దివ్యౌషధం. అది అన్ని రకాల అలర్జీలతో పాటు జలుబును సమర్థంగా తగ్గించగలదు. కాలీఫ్లవర్‌లోని ఇండోల్‌–3–కార్బినాల్‌ అనే జీవరసాయనం క్యాన్సర్‌తో పోరాడుతుంది. అది ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్‌ క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. కాలీఫ్లవర్‌లోని సల్ఫోరఫేన్‌ వంటి ఫైటో  కెమికల్స్‌ కూడా ఎన్నో ఉన్నాయి. అవి సైతం క్యాన్సర్లతో సమర్థంగా పోరాడటంలో తోడ్పడతాయి. వీటిలోని సల్ఫోరఫేన్‌ పిల్లల్లో కనిపించే ఆటిజమ్‌ను నివారిస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే ఇది పరిశోధన దశలో ఉంది. ఒకవేళ ఈ పరిశోధన విజయవంతమైతే వెజిటబుల్‌ రూపంలో ఆటిజమ్‌కు ఒక స్వాభావిక ఔషధం లభ్యమైనట్టే. కాలిఫ్లవర్‌ గాయాల/ దెబ్బల వల్ల కలిగే వాపు, మంట, నొప్పి (ఇన్‌ఫ్లమేషన్‌)ని తగ్గిస్తుంది.

కాలిఫ్లవర్‌ మంచి డీ–టాక్సిఫైయింగ్‌ ఏజెంట్‌. ఇది ఒంట్లో పేరుకుపోయే చాలా విషాలనూ, వ్యర్థాలను సమర్థంగా శుభ్రం చేస్తుంది. ఇది మాక్యులార్‌ డీజనరేషన్‌ వంటి కంటి జబ్బులను నివారిస్తుంది. కాలిఫ్లవర్‌ను తినేవారిలో కనుచూపు చాలాకాలం పాటు పదిలంగా ఉంటుంది. డయాబెటిస్, పక్షవాతం, మెదడుకు సంబంధించిన అలై్జమర్స్‌ డిసీజ్, పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌లను కాలిఫ్లవర్‌ సమర్థంగా నివారిస్తుంది. కాలిఫ్లవర్‌లో కొలెస్ట్రాల్‌ పాళ్లు ఇంచుమించు జీరో. కాబట్టి గుండెజబ్బులు ఉన్న వాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు. దాదాపు అన్ని రకాల గుండెజబ్బులను అది సమర్థంగా నివారిస్తుంది.  బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించడంలో, స్థూలకాయాన్ని నివారించడంలో దీని భూమిక చాలా కీలకమైనది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top