వాయు కాలుష్యంతో పెరుగుతున్న  గుండె కవాటాలు! 

Growing heart valves with air pollution - Sakshi

వాయు కాలుష్యం మనుషుల గుండె కవాటాలను పెద్దవిగా చేస్తున్నాయని బ్రిటన్‌లో జరిగిన ఒక తాజా అధ్యయనం చెబుతోంది. గుండె పనిచేయకుండా పోయేందుకు కవాటాలు పెద్దవి కావడం ఒక కారణమని ఇప్పటివరకూ ఉన్న అంచనా. వాయు కాలుష్యం వల్ల గుండెజబ్బులు వస్తాయని ఇప్పటికే పలు పరిశోధనలు రుజువు చేసిన నేపథ్యంలో తాము దాదాపు నాలుగు వేల మందిపై అధ్యయనం మొదలుపెట్టామని, అంతర్జాతీయ వాయు కాలుష్య ప్రమాణాల ప్రకారం తక్కువ స్థాయి కాలుష్యమున్న ప్రాంతాల్లో నివసిస్తున్న వీరు 40 – 69 మధ్య వయస్కులనీ, గుండెజబ్బుల్లాంటివి ఏవీ లేని వీరు ఐదేళ్లపాటు వాయుకాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసించారని, 2014 – 15లో వీరికి ఎంఆర్‌ఐ తీసి పరిశీలించినప్పుడు గుండెకవాటాల సైజు ఎక్కువైనట్లు స్పష్టమైందని డాక్టర్‌ నే ఆంగ్‌ తెలిపారు.

కవాటాల సైజు పెరిగింది కొద్దిగానే అయినప్పటికీ గుండెజబ్బుల విషయంలో ప్రభావం చూపే స్థాయిలో ఉందని, కాలుష్యాన్ని నియంత్రించకపోయినా, తగిన చికిత్స తీసుకోకపోయినా.. ఈ పరిస్థితి గుండె పనిచేయడం ఆగిపోవడానికి కారణం కావచ్చునని వివరించారు. వాహనాల నుంచి వెలువడే నైట్రిక్‌ ఆక్సైడ్, అతి సూక్ష్మమైన ధూళి కణాలు (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌) ఈ సమస్యలకు కారణమవుతున్నట్లు ఆంగ్‌ చెప్పారు 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top