జీన్స్‌ప్యాంట్‌తో అదేపనిగా కింద కూర్చోకండి! | Do not sit down the same with the jeanspant | Sakshi
Sakshi News home page

జీన్స్‌ప్యాంట్‌తో అదేపనిగా కింద కూర్చోకండి!

Nov 8 2017 11:39 PM | Updated on Nov 8 2017 11:39 PM

 Do not sit down the same with the jeanspant - Sakshi

జీన్స్‌ప్యాంట్‌ పొందినంత ప్రాచుర్యం ఫ్యాషన్‌ ప్రపంచంలో మరే ప్యాంట్‌కూ లేదు. ఇప్పటికీ జీన్స్‌ ఒక ఫ్యాషన్‌ సింబల్‌గా రాజ్యమేలుతోంది. రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉపయోగించడానికి అనువైనవి కావడంతో దాని ఆధిపత్యం అలా కొనసాగుతోంది. అయితే జీన్స్‌ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేసి (సక్లముక్లం వేసి) కూర్చోవడం  ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు నిపుణులు. జీన్స్‌ ప్యాంట్‌ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే  ఒక్కోసారి జీన్స్‌ ప్యాంట్లతో బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకుని కూర్చునేవారు అస్సలు నడవలేని పరిస్థితి కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు.

వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్‌ వేసుకొని ‘స్క్వాటింగ్‌’ ఎంతమాత్రమూ చేయకూడదని  హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ‘జర్నల్‌ ఆఫ్‌ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్‌ జర్నల్‌లో పొందుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement