అవునా?

Devotional information - Sakshi

అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది.
 చిన్న అరటి (యాలక్కి అరటి) నైవేద్యంగా ఉంచితే ఆగిపోయిన పనులు ముందుకు సాగడమేగాక త్వరగా పూర్తవుతాయి.
  అరటి పండు గుజ్జు నైవేద్యంగా పెట్టడం ద్వారా – అప్పుల బాధ తొలగిపోతుంది. రావలసిన డబ్బు తిరిగి వస్తుంది. నష్టపోయిన నగదును పొందే అవకాశం, రాదనుకున్న నగదు తిరిగి రావటం, ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ కట్టినా తిరిగి వస్తుంది. శుభకార్యాలకు కావలసిన నగదు సకాలంలో చేతికి అందుతుంది.
  పూర్ణఫలం లేక కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే – పనులు త్వరగా, సులభంగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు.
  సపోటా పండును నైవేద్యంగా పెడితే,అమ్మాయిని చూసి వెళ్లినవారు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తున్నా లేదా సంబంధం చేసుకునేందుకు నిరాకరించినా, ఇతరుల మధ్యవర్తిత్వం ద్వారా ప్రయత్నించినా అబ్బాయి తరపు వారు నిరాకరిస్తే, సపోటాపండును దేవునికి నైవేద్యంగా పెడితే ఎటువంటి అవాంతరాలైనా తొలగిపోతాయి.
 కమలాపండును నైవేద్యంగా పెడితే – పనులు చేసి పెడతామని మాట ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాలతో పనులను ఆపేస్తే, కమలాపండును దేవునికి నైవేద్యంగా ఉంచితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా అయ్యే పనులు పూర్తవుతాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top