రెండు గంటల్లో క్రెడిట్ కార్డు.. | Credit card within two hours .. | Sakshi
Sakshi News home page

రెండు గంటల్లో క్రెడిట్ కార్డు..

Sep 12 2014 11:20 PM | Updated on Sep 2 2017 1:16 PM

రెండు గంటల్లో క్రెడిట్ కార్డు..

రెండు గంటల్లో క్రెడిట్ కార్డు..

బ్యాంకులు మళ్లీ విరివిగా క్రెడిట్ కార్డులు ఇస్తున్నప్పటికీ.. వీటిని తీసుకోవాలంటే బోలెడు ప్రక్రియ, సమయం పట్టేస్తోంది. అయితే, సిటీ బ్యాంక్ మాత్రం కొన్ని చోట్ల కేవలం రెండు గంటల్లోనే ఇన్‌స్టంట్‌గా క్రెడిట్ కార్డు అందిస్తోంది.

బ్యాంకులు మళ్లీ విరివిగా క్రెడిట్ కార్డులు ఇస్తున్నప్పటికీ.. వీటిని తీసుకోవాలంటే బోలెడు ప్రక్రియ, సమయం పట్టేస్తోంది. అయితే, సిటీ బ్యాంక్ మాత్రం కొన్ని చోట్ల కేవలం రెండు గంటల్లోనే ఇన్‌స్టంట్‌గా క్రెడిట్ కార్డు అందిస్తోంది. కస్టమర్ చేయాల్సిందల్లా బ్యాంక్ బ్రాంచీలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఐడీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్‌తో పాటు శాలరీ స్లిప్, ఫొటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అందజేయడమే.

సదరు బ్రాంచీ సిబ్బంది అప్పటికప్పుడు సిబిల్ స్కోరును, ఇతరత్రా అంశాలను పరిశీలిస్తారు. అంతా సవ్యంగా ఉన్న పక్షంలో దరఖాస్తుదారు పేరుతో అప్పటికప్పుడు కార్డును చేతికి అందిస్తారు. ఈ ప్రక్రియంతా గంటా, రెండు గంటల్లో పూర్తయిపోతుంది. ప్రస్తుతానికైతే, ముంబై, బెంగళూరులో మాత్రమే సిటీ బ్యాంక్ ఈ తరహా కార్డులు జారీ చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement