పల్మునాలజిస్ట్ కౌన్సెలింగ్ | Counseling palmunalajist | Sakshi
Sakshi News home page

పల్మునాలజిస్ట్ కౌన్సెలింగ్

May 29 2015 10:39 PM | Updated on Sep 3 2017 2:54 AM

సీఓపీడీ అంటే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్.

నాకు విపరీతంగా దగ్గు వస్తుంటే డాక్టర్‌ను కలిశాను. సీఓపీడీ అని చెప్పి స్మోకింగ్ మానేయమన్నారు. సీఓపీడీ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఉందా?
 - సుధీర్, హైదరాబాద్

సీఓపీడీ అంటే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్. ఇందులో ఊపిరితిత్తులకు నిత్యం పొగచూరడం వల్ల వాయునాళాలు సన్నబడతాయి. కాబట్టి విపరీతమైన దగ్గు వచ్చి,  ఒక్కోసారి కళ్లె పడుతుంటుంది. సీఓపీడీకి  ఎంత త్వరగా చికిత్స జరిగితే అంత తేలిగ్గా/సమర్థంగా అదుపు చేయవచ్చు. ఈ చికిత్సలో భాగంగా థియోఫిలిన్ మాత్రలను వాడాల్సి ఉంటుంది.

అలాగే వాయు నాళాలను వెడల్పు చేసేందుకు పీల్చే మందులైన ‘బ్రాంకోడయలేటర్స్’ను వాడుతారు. ఇవి  శ్వాసనాళాలను వెడల్పు చేసి మరింత బాగా/కులాసాగా శ్వాస పీల్చుకోడానికి తోడ్పడతాయి. ఇది కాస్త దీర్ఘకాలం చేయాల్సిన చికిత్స కాబట్టి దగ్గు వంటి లక్షణాలు తగ్గగానే, వ్యాధి తగ్గినట్లుగా అపోహ పడవద్దు. వ్యాధి లక్షణాలు తగ్గినట్లు అనిపించినా తప్పక ఫాలోఅప్‌కు వెళ్తుండాలి.
 
 డాక్టర్ వి.వి.రమణ ప్రసాద్
 కన్సల్టెంట్  పల్మునాలజిస్ట్,
 కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement