breaking news
Obstructive
-
కంటినిండా కునుకు లేదు
సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్ల కారణంగా దేశంలోని 11% మంది నిద్రకు సంబంధించిన రుగ్మత అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. కొందరిలో ఓఎస్ఏ తీవ్రమై మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులతోపాటు ప్రాణాంతకమైన గుండెపోటుకు కారణమవుతోంది. ఈ విషయం ఎయిమ్స్–న్యూఢిల్లీ వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. 8 అధ్యయనాల డేటాను విశ్లేషించి ఆ ఫలితాలను స్లీప్ మెడిసిన్ రివ్యూ జర్నల్లో ఇటీవల ప్రచురించారు. దేశంలోని పనిచేసే వయస్సు వారిలో సుమారు 10.4 కోట్ల మంది ఓఎస్ఏతో బాధపడుతున్నట్టు ఎయిమ్స్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ నంత్ మోహన్ వెల్లడించారు. ఈ సమస్య శ్రామిక జనాభా ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ప్రజలలో నిద్ర రుగ్మతల గురించి తక్షణ అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. మన ఆస్పత్రుల్లో చికిత్స రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓఎస్ఏ సమస్యకు ఉచితంగా చికిత్స అందిస్తారు. గుంటూరు జీజీహెచ్లో స్లీప్ ల్యాబ్ సైతం అందుబాటులో ఉంది. నిద్ర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ ల్యాబ్లో పాలినోగ్రఫీ పరీక్ష నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రూ.25వేల ఖర్చు అయ్యే పాలినోగ్రఫీ పరీక్షను ఉచితంగా చేస్తున్నారు. ఓఎస్ఏ సమస్య అంటే ఓఎస్ఏ అనేది తీవ్రమైన నిద్ర లేమి సమస్య. ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఒక శ్వాసనాళం ఉంటుంది. ఆ నాళం మూసుకుపోయినప్పుడు శరీరంలోకి సరిపడినంత ఆక్సీజన్ అందదు. ఈ సమస్యనే స్లీప్ అప్నియా అంటారు. ఓఎస్ఏ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దీంతో మధ్యలో మెలకువ వస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం ఆగిపోయి పెద్దగా గురక పెడుతుంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే ఓఎస్ఏతోపాటు మధుమేహం, హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోమయోపతి, గుండెపోటు, గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది పురుషులు, 10 శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్య రంగ నిపుణుల అంచనా. మనదేశంలో 11శాతం మంది పెద్దలు ఈ సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు. ఇవీ ఓఎస్ఏ లక్షణాలు రాత్రిపూట నిద్రలో తరచూ మెలకువరావడం, చెమటలు పట్టడం నోరు ఎండిపోయిన అనుభూతి గట్టిగా గురకపెట్టడం తీవ్ర అలసట ఒత్తిడి, అశాంతి, ఆందోళన జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మతిమరుపు, చిరాకు -
పల్మునాలజిస్ట్ కౌన్సెలింగ్
నాకు విపరీతంగా దగ్గు వస్తుంటే డాక్టర్ను కలిశాను. సీఓపీడీ అని చెప్పి స్మోకింగ్ మానేయమన్నారు. సీఓపీడీ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఉందా? - సుధీర్, హైదరాబాద్ సీఓపీడీ అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్. ఇందులో ఊపిరితిత్తులకు నిత్యం పొగచూరడం వల్ల వాయునాళాలు సన్నబడతాయి. కాబట్టి విపరీతమైన దగ్గు వచ్చి, ఒక్కోసారి కళ్లె పడుతుంటుంది. సీఓపీడీకి ఎంత త్వరగా చికిత్స జరిగితే అంత తేలిగ్గా/సమర్థంగా అదుపు చేయవచ్చు. ఈ చికిత్సలో భాగంగా థియోఫిలిన్ మాత్రలను వాడాల్సి ఉంటుంది. అలాగే వాయు నాళాలను వెడల్పు చేసేందుకు పీల్చే మందులైన ‘బ్రాంకోడయలేటర్స్’ను వాడుతారు. ఇవి శ్వాసనాళాలను వెడల్పు చేసి మరింత బాగా/కులాసాగా శ్వాస పీల్చుకోడానికి తోడ్పడతాయి. ఇది కాస్త దీర్ఘకాలం చేయాల్సిన చికిత్స కాబట్టి దగ్గు వంటి లక్షణాలు తగ్గగానే, వ్యాధి తగ్గినట్లుగా అపోహ పడవద్దు. వ్యాధి లక్షణాలు తగ్గినట్లు అనిపించినా తప్పక ఫాలోఅప్కు వెళ్తుండాలి. డాక్టర్ వి.వి.రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్