కరోనా కథలు ; మా ఇంటికి రాకండి

Coronavirus Effect Grandmother Self House Arrest in Hyderabad - Sakshi

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా ‘కరో’ నా అని హెచ్చరిస్తోంది. అంటే కొన్ని పనులు చేయొద్దు అని ముందుజాగ్రత్తలు చెబుతోంది. విదేశాల నుంచి ఎవరైనా అత్యవసరంగా స్వదేశానికి వస్తే, వాళ్లని కొన్ని రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రావద్దని, ఎవ్వరితోనూ సంభాషించొద్దని, ఒంటరిగా ఉండటం మంచిదని సూచిస్తోంది. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారు హైదరాబాద్‌ మోతీనగర్‌లో నివాసం ఉంటున్న సత్యవతమ్మ గారు (పేరు మార్చాం). ఆవిడ వయసు 70. ఇటీవలే దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఆవిడ తనంతట తానుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పని అమ్మాయిని నెలాఖరు దాకా పని చేయడానికి రావొద్దన్నారు. పై అంతస్థులో ఉండే కూతుర్ని కూడా రావొద్దని ఆవిడ తనకు తానుగా నియమాలు విధించుకున్నారు. తానుగా పని చేసుకోలేకపోయినా, కష్టపడి తన పనులు తనే చేసుకుంటున్నారు. కాలక్షేపం కోసం ఫోన్‌లో పేకాట ఆడుకుంటున్నారు. ఇది అందరికీ మంచిది. ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండటానికి సత్యవతమ్మగారు అనుసరిస్తున్న విధానం బాగుంది కదూ!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top