క్షణాల్లో పిజ్జా స్వాహా | Competitive eater challenged to fastest time to eat a 12'' pizza record - Guinness World Records Italian Show | Sakshi
Sakshi News home page

క్షణాల్లో పిజ్జా స్వాహా

Apr 28 2016 12:21 AM | Updated on Aug 21 2018 2:34 PM

క్షణాల్లో పిజ్జా స్వాహా - Sakshi

క్షణాల్లో పిజ్జా స్వాహా

సుతిమెత్తని మిఠాయిలను, నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఐస్‌క్రీములను శరవేగంగా స్వాహా చేసేయవచ్చు.

తిక్క లెక్క
సుతిమెత్తని మిఠాయిలను, నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఐస్‌క్రీములను శరవేగంగా స్వాహా చేసేయవచ్చు. దంతాలకు పని కల్పించే పిజ్జాలాంటి పదార్థాన్ని క్షణాల్లో స్వాహా చేయడమంటే మాటలా..? నమలడంలో దంతాలకు, దవడలకు వ్యాయామం కల్పించే పిజ్జాను క్షణాల్లో స్వాహా చేసి పారేశాడు ఈ ఫొటోలో కనిపిస్తున్న కెనడియన్ పెద్ద మనిషి. ఇతడు తిన్న పిజ్జా సైజు చిన్నదేమీ కాదు. ఏకంగా పన్నెండంగుళాల వ్యాసంతో పద్ధతిగా తయారు చేసిన పిజ్జా అది. మరో ఇద్దరితో కలసి పందెంలో పాల్గొన్న పీటర్ జెర్‌వెన్‌స్కీ అనే ఈ కెనడియన్ బకాసురుడు కేవలం 32.28 సెకండ్లలోనే ప్లేటులో పెట్టిన పిజ్జాను ఖాళీచేసేసి బ్రేవ్‌మని తేన్చాడు. ఈ ఘనకార్యంతో గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement