గోడమీద బల్లి... వ్యాయామానికి స్ఫూర్తి | Climbing started with the first mountains | Sakshi
Sakshi News home page

గోడమీద బల్లి... వ్యాయామానికి స్ఫూర్తి

Dec 6 2017 11:49 PM | Updated on Dec 7 2017 1:50 AM

Climbing started with the first mountains - Sakshi

క్లైంబింగ్‌ అనేది తొలుత పర్వతాలతో ప్రారంభమైంది. పర్వతారోహణ (మౌంటెనీరింగ్‌),  రాక్‌క్లైంబింగ్, ఐస్‌ క్లైంబింగ్‌ .. ఇలా విస్తరించింది. రాక్‌ మీద ఐస్‌ ఫామ్‌ అయితే దాన్ని మిక్స్‌డ్‌ క్లైంబింగ్‌ అంటారు.  క్లైంబింగ్‌ అద్భుతమైన వ్యాయామంగా ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిని ఇప్పుడ బౌల్డరింగ్‌ అంటున్నారు.

వ్యాయామ సాధనంగా క్లైంబింగ్‌ను అనుసరించేవారి కోసం ఆర్టిఫిషియల్‌ వాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. దీనిని స్పోర్ట్స్‌ క్లైంబింగ్‌ అంటారు. దీనిలో కూడా 3 విభాగాలున్నాయి. వాల్‌ ఎత్తు 15 అడుగులు అంతకన్నా లోపుంటే బౌల్డరింగ్‌ సెగ్మెంట్‌ అంటారు. ఈ సెగ్మెంట్‌లో పాల్గొనేవాళ్ల కోసం కిందపడినా గాయాలు కాకుండా ఫ్లోర్‌ మీద పరుపులు వేసి ఉంచుతారు. లీడ్‌ క్లైంబింగ్‌లో గోడ 30–40 అడుగుల ఎత్తు పైన ఉంటుంది. భయం లేకుంటేనే లీడ్‌ క్లైంబింగ్‌. దీనిలో గోడకు హ్యాంగర్స్‌ ఉంటాయి. వేగం ప్రధానంగా సాగేది స్పీడ్‌ క్లైంబింగ్‌. దీనిలో క్రీడాకారుడు రోప్‌ కట్టుకుని వాల్‌ మీద ఎక్కుతాడు.

ఫిట్‌నెస్‌ సాధనం...
లీడ్, స్పీడ్‌ క్లైంబింగ్‌లు మౌంటెనీరింగ్‌ను సీరియస్‌ హాబీగా తీసుకున్నవారికే పరిమితం. పైగా అంత కాంపిటీటివ్‌ వాల్స్‌ కూడా నగరాల్లో అందుబాటులో లేవు. దీంతో   బౌల్డరింగ్‌ ఒక ఫన్‌ యాక్టివిటీగా, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు ఉపకరించేదిగా ఇప్పుడు ఆకర్షిస్తోంది. ఇప్పటికే బౌల్డరింగ్‌ని ఒక వినోద సాధనంగా. వ్యాయామ మార్గంగా జిమ్స్‌లోనూ ఈ బౌల్డరింగ్‌ సాధన కోసం అమర్చిన వాల్స్‌ ఉన్నాయి.  

హై ఎనర్జీ...
 హై ఎనర్జీ, హైపర్‌ యాక్టివిటీ ఉన్న చిన్నారులకు ఇప్పుడు వాల్‌ క్లైంబింగ్‌ అద్భుతమైన హాబీ. గంట పాటు బౌల్డరింగ్‌ చేస్తే 900 కేలరీలు బర్న్‌ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అదే అన్ని కేలరీలు బర్న్‌ కావాలంటే వేరే వర్కవుట్‌లో కనీసం 2గంటలు చేయాలి. అంతేకాకుండా మంచి ఫన్‌ కూడా ఉండడంతో అలసట ఎక్కువగా రాదు. అంతేకాకుండా బ్యాలెన్సింగ్‌ చేసుకునే సామర్ధ్యం బాగా పెరుగుతుంది. కోర్‌ మజిల్స్‌ శక్తిమంతంగా మారతాయి. చేతులు, కాళ్ల మజిల్స్‌ టోనప్‌ అవుతాయి.

ఇంట్లోనూ...
వీటిని ఇంట్లో కూడా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్‌ వాల్‌ని ఫైబర్‌తో చేసి సపోర్ట్‌ స్ట్రక్చర్‌ సాలిడ్‌ వుడ్, లేదా స్టీల్‌ ఉంటుంది. అయితే వుడ్‌ ఖరీదు ఎక్కువ కాబట్టి...  స్టీల్‌ బెటర్‌. క్లైంబింగ్‌ సర్ఫేస్‌గా ప్లైవుడ్‌ లేదా ఫైబర్‌ గ్లాస్‌ గాని వాడి చేసే 8విడ్త్‌ 12 ఫీట్‌ హైట్‌ వాల్‌కి రూ.1లక్ష ఖర్చులోనే అయిపోతుంది. అదే 24ఫీట్‌ వాల్‌కి అయితే రూ.4లక్షలు వరకూ అవుతుంది. అయితే దీన్ని తయారు చేసేవారు ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో లేరు. పూనె లాంటి నగరాల్లో చిల్డ్రన్‌ బెడ్‌రూమ్స్‌లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల కోసం అయితే 8, 9 అడుగుల వాల్‌ సరిపోతుంది. ఆల్రెడీ ఉన్న వాల్‌కి దీన్ని సెటప్‌ చేస్తారు. బెడ్‌రూమ్‌ ఉంటే ఒక కార్నర్‌లో క్లైంబింగ్‌ వాల్‌ పెడతారు.
 – ఎస్‌.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement