పది నిమిషాల్లోనే నోరూరించే చాకోచిప్‌ కుకీస్‌

Choco Chip Cookies making In Ten Minutes Without Egg and Oven - Sakshi

నచ్చిన వంటలు చేసుకుని తినడంలో వచ్చే కిక్కే వేరు. ఇక ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇంట్లో బోరింగ్‌ ఫీల్‌ అవుతున్నవారు రకరకాల వంటలతో బిజీగా గడుపుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు లాక్‌డౌన్‌లో‌ గరిటె తిప్పడంపై శ్రద్ధ పెడుతున్నారు. వంటలు, స్నాక్స్‌, సలాడ్స్‌ ఇలా ఎన్నో రకాల రుచికరమైన వాటిని చేసుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ఎప్పుడూ ఒకే విధమైన వంటకాలు చేయడం నచ్చలేని వాళ్లు కొత్తగా ఏదైనా తయారు చేయాలనుకుంటారు. అలాంటి వారు ఓ సారి చాకోచిప్‌ కుకీలను తయారు చేసి చూడండి. ఇది తెలిసిన వంటకమే అయినా తక్కువ పదార్థాలతో, చాలా తొందరగా చేయడం తెలిస్తే ఇక ఎప్పుడు దీనిని వదలరు. (మాల్స్‌ను వీడి... వీధుల్లోకి రెస్టారెంట్లు)

ఈ రకమైన బిస్కెట్లు తయారు చేయడానికి కేవలం పది నిమిషాలే సరిపోతుంది. అలాగే దీనికి ఓవెన్‌, ఎగ్స్‌ కూడా అవసరం లేదు. కావున శాఖాహార ప్రియులు కూడా లాగించేయవచ్చు. చిన్న వాళ్ల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికి ఈ చాకోచిప్‌ కుకీలు నచ్చుతాయి. బయట భాగంలో క్రంచీగా, లోపల మృదువుగా ఉంటాయి. దీని తయారీకి మీకు కావలిసిందల్లా కేవలం మూడు పదార్థాలు. మరి అవేంటో తెలుసుకుందాం. (కాలక్షేపం కోసం వీటిని తినేస్తున్నారు..)

దీనికి కావాల్సిన పదార్థాలు
♦ 2 టేబుల్ స్పూన్లు - చాకో చిప్స్
♦ 100 గ్రా - వెన్న
♦ 1/2 కప్పు -  పొడి చేసిన చక్కెర
♦  1 కప్పు - మైదా పిండి

చాకోచిప్‌ కుకీలు ఎలా తయారు చేయాలో చుద్దాం..
► ముందుగా ఒక గాజు గిన్నె తీసుకొని అందులో 100 గ్రాముల వెన్న వేసి మెత్తటి మిశ్రమంలా అయ్యే వరకు గిలకొట్టండి. అందులో అర కప్పు పొడిగా చేసిన చక్కెర కలపండి. దీనిని మెత్తగా కలపాలి.

► తరువాత ఇందులో ఒకటి పావు మైదా పిండిని జోడించండి. రుచికి సరిపడా ఉప్పు వేసి మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా మామూలుగా ఉండే పిండి ముద్దలా తయారు చేసుకోవాలి.

► 2 టేబుల్ స్పూన్ల చోకో-చిప్ కుకీలను వేసి పూర్తిగా కలపాలి. నాన్-స్టిక్ పాన్ తీసుకోని ఆయిల్‌ వేసి దానిపై  వెన్న కాగితాన్ని ఉంచి మరోసారి నూనెతో తడపాలి.

► చేతులోకి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చిన్న బంతి లాగా చేసి అరచేతులతో దాన్ని కొంచెం వెడల్పు చేయాలి. పాన్‌లో సరిపోయేంతలా చిన్నగా చేసుకుని ప్రతి పిండి ముద్దకు మధ్యలో సరైన గ్యాప్‌ ఉంచాలి.

►ఇప్పుడు కుకీలకు కొద్దిగా చోకో-చిప్స్ జోడించండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. పాన్‌పై మూత పెట్టి తక్కువ మంటతో 10 నిమిషాల పాటు వేడి చేయండి.  స్టవ్‌ కట్టేసి,గా పాన్‌పై మూత తీసి కుకీలు పూర్తిగా చల్లబడేదాకా ఆగండి. అంతే నోరూరించే టేస్టీ, క్రంచీ కుకీలు రెడీ. ఇంకేందుకు ఆలస్యం టెస్ట్‌ చేయండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top