క్యాన్సర్లతో పోరాడే కాలీఫ్లవర్‌...

Cauliflower fighting with cancer - Sakshi

గుడ్‌ ఫుడ్‌

గోబీ పువ్వు అంటూ తెలుగులో మనం పిలుచుకునే దీనితో సాధారణంగా కూర చేసుకుంటాం. కూరగా తింటే రుచిగా ఉండటమే కాదు... క్యాన్సర్ల పాలిట క్రూరంగా కూడా ఉంటుంది

కాలీఫ్లవర్‌. దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని ఇవి...
►కాలీఫ్లవర్‌లోని సల్ఫోరఫేన్‌ వంటి ఫైటో కెమికల్స్‌ క్యాన్సర్లతో పోరాడతాయి. సల్ఫోరఫేన్‌ అనే పోషకం ఆటిజమ్‌ను నివారించడంలో కూడా తోడ్పడుతుందని అధ్యయనాలచెబుతున్నాయి. అయితే ఇవి ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి.

►కాలీఫ్లవర్‌లోని ఇండోల్‌–3–కార్బినాల్‌ అనే స్టెరాల్‌ అనే జీవరసాయనం కూడా  క్యాన్సర్‌తో పోరాడుతుంది. ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్‌ క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది.

►అన్ని రకాల అలర్జీలతో పాటు జలుబును సమర్థంగా తగ్గించే సామర్థ్యం కాలిఫ్లవర్‌కు ఉంది.  

►హార్మోన్ల సమతౌల్యతకు కాలిఫ్లవర్‌ బాగా దోహదపడుతుంది.

►మాక్యులార్‌ డీజనరేషన్‌ వంటి కంటి జబ్బులను నివారిస్తుంది. కనుచూపును దీర్ఘకాలం పరిరక్షిస్తుంది. ∙డయాబెటిస్, పక్షవాతం, మెదడుకు సంబంధించిన అలై్జమర్స్‌ డిసీజ్,పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌లను ఇది నివారిస్తుంది.

►కాలిఫ్లవర్‌లో కొలెస్ట్రాల్‌ దాదాపుగా ఉండదు కాబట్టి గుండెజబ్బులు ఉన్న వాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు. అలాగే అన్ని రకాల గుండెజబ్బులను అది నివారిస్తుంది. బరువునుఆరోగ్యకరమైన రీతిలో తగ్గించి స్థూలకాయం వచ్చే అవకాశాలను నివారిస్తుంది.

►ఇది గాయాల/దెబ్బల వల్ల కలిగే వాపు, మంట, నొప్పి (ఇన్‌ఫ్లమేషన్‌)ను తగ్గిస్తుంది. కాబట్టి ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గాలనుకున్న వారికి దీన్ని సిఫార్సు చేయవచ్చు.

►ఒంట్లో పేరుకుపోయే చాలా విషాలనూ, వ్యర్థాలను ఇది సమర్థంగా శుభ్రం చేస్తుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top