విహారయాత్రల్లో జాగ్రత్తగా ఉంటున్నారా?

Careful in picnic? - Sakshi

సెల్ఫ్‌  చెక్‌

సమ్మర్‌ వచ్చేసింది. ఏడాదిపాటు స్కూల్‌లో కష్టపడి చదివిన పిల్లలకు వేసవి సెలవులు ఆనందాన్ని పంచుతాయి. టీవీలతో బిజీగా, ఆటపాటలతో విశ్రాంతి లేకుండా, కోరిన వంటలు తింటూ రోజంతా ఇంటిలో చిన్నారులు ఎంజాయ్‌ చేస్తారు. ఈ ఆనందానికి విహారయాత్రలు కూడ జోడిస్తే? ఎగిరి గంతేస్తారు. ప్లాన్‌ చేసింది మొదలు ఎప్పుడెప్పుడు వెళదామా అని పేరెంట్స్‌ని తొందర పెట్టేస్తుంటారు. విహారయాత్రల వల్ల పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మెచ్యూరిటీ సాధిస్తారు. అయితే టూర్‌కి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. మీకు ఆ జాగ్రత్తలు తెలుసో లేదో ఒకసారి చెక్‌ చేసుకోండి.

1.    మీరనుకున్న ప్రదేశానికి వెళ్లేటప్పుడు ఎలా ప్లాన్డ్‌గా టికెట్స్‌ బుక్‌ చేసుకుంటారో రిటన్‌ జర్నీ గురించి కూడా అలానే ప్లాన్‌ చేసుకుంటారు.
    ఎ. కాదు     బి. అవును 

2.    దర్శనీయ ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నా మీ రోజువారి అలవాట్లలో (భోజ నం, నిద్రపోయే సమయాలు మొదలైనవి) మార్పులేకుండా చూసుకుంటారు.
    ఎ. కాదు     బి. అవును 

3.    ట్రావెల్‌ చేసేముందు బాగా రెస్ట్‌ తీసుకుంటారు. మెడికల్‌ కిట్, డాక్టర్‌ ఫోన్‌ నెంబర్‌ దగ్గర ఉంచుకుంటారు. ప్రయాణంలో కంఫర్ట్‌బుల్‌ డ్రెస్‌లు వేసుకుంటారు.
    ఎ. కాదు     బి. అవును 

4.    ఎక్కువమంది ఉన్న ప్రదేశాల్లో, బాగా రద్దీగా, గొడవగా ఉండే ప్రాంతాల్లో తక్కువ సమయం గడుపుతారు. మీ కుటుంబ సభ్యులందరూ మీతోనే ఉన్నారా లేదా అని గమనిస్తుంటారు.
    ఎ. కాదు     బి. అవును 

5.    ట్రిప్‌లో మీతోపాటు వచ్చేవారి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉందా లేదా అని గమనిస్తారు. డాక్టరు సలహా పొందుతారు. వారి కేర్‌ మీరు తీసుకోగలరా లేదా అని గమనిస్తారు.
    ఎ. కాదు     బి. అవును 

6.    జర్నీ చాలాసేపు కొనసాగేలా ఉంటే టైంపాస్‌ కోసం ఆటవస్తువులు మీ వెంట తీసుకెళతారు. కెఫైన్‌ ఉత్పత్తులకు దూరంగా ఉంటారు.
    ఎ. కాదు     బి. అవును 

7.    వాహనాన్ని మీ కుటుంబసభ్యులే డ్రైవ్‌ చేస్తుంటే వారి పక్కనే కూర్చొని వారిని ఉత్సాహపరుస్తారు. జాగ్రత్తగా డ్రైవ్‌ చేసేలా సహాయపడతారు.
    ఎ. కాదు     బి. అవును 

8.    విమాన ప్రయాణం చేస్తుంటే బోర్డింగ్‌పాస్‌లు, పాస్‌పోర్ట్‌ ఇంకా ముఖ్యమైన పేపర్లను జాగ్రత్తగా భద్రపరచుకుంటారు. మతిమరపు ఉన్నవారికి ఇలాంటి ముఖ్యమైన వస్తువులను ఇవ్వరు.
    ఎ. కాదు     బి. అవును 

9.    హోటల్లో బస చేయవలసి వస్తే విశాలంగా, పిల్లలు జాగ్రత్తగా ఉండే రూమ్‌ని ఎంచుకుంటారు.
    ఎ. కాదు     బి. అవును 

10.    అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తీవ్రంగా స్పందించకుండా భావోద్వేగాలను కంట్రోల్‌ చేసుకొనే ప్రయత్నం చేస్తారు.
    ఎ. కాదు     బి. అవును 

బి’ లు ఏడు దాటితే దూరప్రయాణాలప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలుసు. ట్రిప్‌ని ఎంజాయ్‌ చేస్తూనే కేర్‌ఫుల్‌గా ఉంటారు. ‘ఎ’ లు ఆరు దాటితే విహారయాత్రలో ఆనందంగా ఉండాలనుకుంటారే కాని జాగ్రత్తలు తీసుకోరు. దీనివల్ల నష్టంతో పాటు ప్రమాదాలూ సంభవిస్తాయి. ‘బి’ లను సూచనలుగా తీసుకొని జర్నీలో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. వివిధరకాల మార్గాల ద్వారా ట్రావెలింగ్‌ జాగ్రత్తలను తెలుసుకొనే ప్రయత్నం చేయండి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top