అల్సర్స్‌ను దూరం చేస్తుంది | Cabbage is good for health | Sakshi
Sakshi News home page

అల్సర్స్‌ను దూరం చేస్తుంది

Nov 7 2017 12:07 AM | Updated on Nov 7 2017 12:07 AM

 Cabbage is good for health - Sakshi

ఉడికించేటప్పుడు కాస్తంత వాసన వేస్తుంది కానీ, క్యాబేజీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్‌) చాలా ఎక్కువ. అందుకే పేగులకు దీనివల్ల ఎంతో మేలు. క్యాబేజీని క్రమం తప్పకుండా తినేవారిలో పేగుల్లో అల్సర్స్‌ నివారితమవుతాయి.  ముఖ్యంగా ఇది పెద్ద పేగు ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది.మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందడానికి క్యాబేజీ చాలా నమ్మకమైన ఆహార పదార్థం.క్యాబేజీలో విటమిన్‌ సి, విటమిన్‌ కె, ఫోలేట్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్‌ ఏ, థయాబిన్, క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్‌... వంటి పోషకాలన్నీ ఎక్కువ. అందుకే ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే ఆహారంగా దీన్ని పేర్కొంటారు.

క్యాబేజీలోని విలువైన ఫైటో కెమికల్స్‌ అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.దీని నుంచి వెలువడే క్యాలరీలు చాలా తక్కువ. దాదాపు 100 గ్రాముల క్యాబేజీ నుంచి కేవలం 15 క్యాలరీల శక్తి మాత్రమే లభ్యమవుతుంది. అందుకే స్థూలకాయులు, బరువు పెరుగుతున్న వారికి ఇది మంచి ఆహారం. బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఒక గ్లాసు క్యాబేజీ జ్యూస్‌ తీసుకోవడం వల్ల త్వరలోనే ఫలితం కనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement