2016 బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ | Bright and Beautiful | Sakshi
Sakshi News home page

2016 బ్రైట్ అండ్ బ్యూటిఫుల్

Dec 31 2015 10:34 PM | Updated on Sep 3 2017 2:53 PM

2016 బ్రైట్ అండ్  బ్యూటిఫుల్

2016 బ్రైట్ అండ్ బ్యూటిఫుల్

క్రీమ్‌కలర్ లెహంగా పైన నీలం, బంగారు రంగు పువ్వులు.

కొత్తగా ఉండడం బావుంటుంది.
కొత్త ఏడాదిలో నలుగురికీ ఫ్రెష్‌లుక్‌తో కనపడడం మరీ బావుంటుంది.
న్యూ ఇయర్‌కి హ్యాపీనెస్ యాడ్ చేయాలంటే యాడ్‌లో మోడల్‌లా మెరిసిపోవాలి.
మెరుపులను వెదికేవారికి మేం అందిస్తున్న బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ 2016 ఇది...

 
 
క్రీమ్‌కలర్ లెహంగా పైన నీలం, బంగారు రంగు పువ్వులు. అదే థీమ్‌తో డిజైన్ చేసిన జాకెట్ ఈవెనింగ్ పార్టీని బ్రైట్ చేస్తుంది. అందరి చూపులను అట్రాక్ట్ చేస్తుంది. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ డ్రెస్‌ని ఇటీవల లాక్మేఫ్యాషన్ వీక్‌లో మోడల్ ప్రదర్శించారు.
 
1970ల కాలంనాటి స్టైల్‌ని రీ మిక్స్ చేసినట్టు ఉన్న ఈ డ్రెస్ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ముంబయ్ ఫ్యాషన్ డిజైనర్ పాయల్‌ఖండ్‌వాలా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. రెట్రో లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ డ్రెస్ ఈ ఇయర్ పార్టీస్‌కి పర్‌ఫెక్ట్ అనిపించకమానదు.
 
బ్లాక్ కలర్ మిడ్ గౌన్ వెస్ట్రన్ పార్టీలకు క్లాస్ లుక్‌ని తీసుకువస్తుంది. ఈ డ్రెస్ డిజైనర్ అయేషా దీపాల. ఆసియాలోనే మోస్ట్ స్టైలిష్ట్ డ్రెస్ డిజైనర్‌గా పేరొందిన ఆయేషా దుబాయి డిజైనర్ అయినప్పటికీ భారతీయ వస్త్ర శైలులంటే అమితమైన ఆసక్తి. ప్రపంచవ్యాప్తంగా ఆయేషా డ్రెస్ డిజైన్స్ స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాయి.
 
నటి రెజీనా ధరించిన లాంగ్ ఫ్లోయీ గ్రే డ్రెస్ వెస్ట్రన్ పార్టీలకు మోడ్రన్ లుక్‌తో ఆకట్టుకుంటుంది.  నేటి తరం అమ్మాయిల కలలకు తగిన రూపం ఇస్తున్న స్టైలిస్ట్ డిజైనర్  దీక్షా ఖన్నా డిజైన్  చేసిన డ్రెస్ ఇది.
 
ముదురు నీలం రంగు లెహంగా, ఫుల్ స్లీవ్స్ బోట్‌నెక్ జాకెట్‌పై హెవీ ఎంబ్రాయిడరీ ఉంటే వెస్ట్రన్ పార్టీలో గ్రాండ్‌గా మెరిసిపోవచ్చు. ఇండియన్ డిజైనర్ అంజుమోడీ డిజైన్ చేసిన బ్రైడల్ కలెక్షన్‌లో భాగంగా ఈ డ్రెస్‌ను ఇటీవల లండన్‌లో ప్రదర్శించారు.
 
ప్లెయిన్ లేత నీలం రంగు లాంగ్ అనార్కలీ గౌన్ పార్టీని మాటల్లో చెప్పలేనంత బ్రైట్‌గా మార్చేస్తుంది. ప్రఖ్యాత డిజైనర్ దంపతులుగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్న శ్యామల్ అండ్ భూమిక డిజైన్ చేసిన డ్రెస్ ఇది. బ్లౌజ్ భాగాన్ని అదే రంగు మెటీరియల్‌తో తీర్చిదిద్ది ఎంబ్రాయిడరీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement