
మన హైదరాబాద్ ఎందరికో ఆతిథ్యం ఇవ్వడమే గాక వాహ్ భాగ్యనగరం అని అనిపించుకుంది. ఈ నగరం తన రుచులతో, సంస్కృతితో చాలామంది అభిమానులను సంపాదించుకుంది కూడా. అలాంటి మన భాగ్యనగరంలోని హైటెక్ సొగసులకు ఫిదా అవ్వుతూ..వావ్ అని నోరెళ్లబెట్టింది ఈ విదేశీ మోడల్. అంతేగాదు ఐ లవ్ హైదరాబాద్ అని అంటోంది కూడా.
ఢిల్లీకి చెందిన రష్యా మోడల్ క్సేనియా మన హైదరాబాద్‌లోని ఆకాశ హర్మ్యాలు, మౌలిక సదుపాయాలను చూసి మంత్రముగ్దురాలైంది. హైటెక్ సిటీలోని టెక్ హబ్‌ని చూసి ఆశ్చర్యపోయింది. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఇది ముంబై అనుకుంటున్నారు కాదు హైదరాబాద్ అంటూ తాను చూసిన వాటిని అన్నింటిని చూపిస్తోంది వీడియోలో.
ఆకాశాన్ని తాకేలా ఉన్న విలాసవంతమైన ఆ బిల్డింగ్‌లు కళ్లుతిప్పుకోనివ్వడం లేదని చెబుతూ..హైటెక్ నగరంపై ప్రశంసల జల్లు కురిపించింది. అంతేగాదు ఇక్కడ స్కైలైన్‌లు, ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దిన తీరు తదితరాలన్నింటిని అభినందించింది.
అంతేగాదు ఆ వీడియోకి "హబీబీ, ఇది దుబాయ్ కాదు, హైదరాబాద్," అనే క్యాప్షన్‌ని జోడించి మరి పోస్ట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కూడా..ఇక్కడ భాషా వివాదం ఉండదని, మంచి వాతవరణానికి నెలవు, అలాగే భారతదేశానికే ఈ నగరం గర్వకారణం. మాకు కూడా అత్యంత ఇష్టం అని కితాబిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఆమె మోడల్ కాదు..ఐపీఎస్ అధికారిణి..! సక్సెస్‌ని ఆస్వాదించేలోపే..)