
సివిల్స్ ఎగ్జామ్ ఎంత కఠినమైన ప్రతిష్టాత్మక ఎగ్జామ్ అనేది తెలిసిందే. ఐపీఎస్ కావాలంటే ఎన్నో క్లిష్టమైన ఎగ్జామ్‌లు దాటుకుంటూ చేరుకోవాలి. ఏ ప్రాసెస్‌లో ఫెయిలైనా అంతే సంగతులు. అలాంటి ప్రతిష్టాత్మక ఈ సివిల్స్ పరీక్షలో ఓ అందమైన యువతి మంచి మార్కులతో ఉత్తీర్ణురాలెంది. ఆ ఏడాది ఆమె ఫోటోలు నెట్టింట హల్‌చల్ కావడంతో ఆమె మోడల్ అని అనుకున్నారంతా..!. బాలీవుడ్ హీరోయిన్లను తలదన్నే అందం ఆమె సొంతం. అంతేగాదు ఆమె అపారమైన ప్రతిభ, ఆకర్షించే సౌందర్యం కలగలసిన బ్యూటిఫుల్ అధికారిణిగా గుర్తింపు తెచ్చుకోవడమే గాదు యువతకు ఆదర్శంగా నిలిచారామె.
ఆమె పేరు పూరవ్ చౌదరి. 2024 సివిల్స్ ఎగ్జామ్‌లో 533 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్‌ఆఫీసర్ అయ్యారు. లక్షలాది మంది పోటీపడే ఈ ప్రతిష్టాత్మక ఎగ్జామ్ కొంతమంది సక్సెస్‌ని అందుకుంటారు. వారిలో ఒకరు ఈ పూరవ్ చౌదరి. అయితే ఆమె చదువులోనే కాదు అందంలోని బాలీవుడ్ నటీమణులకు తీసిపోని విధంగా అత్యంత ఆకర్షణీయంగా ఉంటారామె. ఆమెకు సోషల్ మీడియాలో కూడా చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజాసేవే ధ్యేయంగా యూపీఎస్సీ ఎగ్జామ్‌ని ఎంచుకున్నారు. అదే ఏడాది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించింది ప్రయాగ్ రాజ్‌కు చెందిన శక్తి దూబే.
ఆమె నేపథ్యం..
పూరవ్ రాజస్థాన్‌కి చెందిన మహిళ. ఆమె తండ్రి ఓం ప్రకాశ్ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS)లో అధికారిగా కోట్‌పుట్లీలో అదనపు జిల్లా కలెక్టర్ పదవిని నిర్వహిస్తున్నారు. ఆమె చదువులో ఎప్పుడూ తెలివైన విద్యార్థిగా ఉండేది. సెయింట్ జేవియర్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది. ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్‌కి పూర్తి సమయం కేటాయించింది. తొలి ప్రయత్నంలో ఐపీఎస్ కేడర్ రాగా, మరో ప్రయత్నంలో ఐఏఏస్ సాధించిందామె.
చిక్కుకున్న వివాదం..
యూపీఎస్సీ ఫలితాలు ప్రకటించగానే అధికారిక ఫలితాల్లో పూర్వ పేరు వద్ద ఓబీసీ నమోదు చేసింది. దీనితో వివాదం రాజుకుంది. ఆమె తండ్రి ఆ ఆరోపణలన్నింటిని తిప్పి కొట్టారు. 40 ఏళ్ల లోపు ప్రత్యక్ష ఆర్‌ఏఎస్ నియామకం విషయంలో OBC NCL ప్రయోజనం వర్తించదు. కానీ తాను 44 ఏళ్ల వయసులో ఆర్‌ఏఎస్ అధికారిని అయ్యాను కాబట్టి తన కుమార్తె సర్టిఫికేట్ దుర్వినియోగానికి పాల్పడిందనేది అవాస్తవం అని వివరణ ఇచ్చారు.
(చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!)