పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 27 2015 11:35 PM | Updated on Sep 3 2017 4:28 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: జాన్ క్యూజక్ (హాలీవుడ్ నటుడు), జస్పాల్ రాణా (షూటర్)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రునికి సంబంధించిన అంకె. కుటుంబ పరమైన బాధ్యతలకు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. పిల్లలకోసం పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. పాతసామానులు, వాహనాల స్థానంలో కొత్తవి కొంటారు. విలాస జీవనానికి ఎక్కువ ఖర్చు చేస్తారు. గతంలో కన్నా ఎంతో రిలాక్స్‌డ్‌గా కనిపిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్‌తో పాటు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. మీడియా రంగంలోని వారికి, కళాకారులకు, సంగీతవిద్వాంసులకు మంచి అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా భర్త ఒక చోట, భార్య ఒక చోట పని చేస్తూ, బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు.

ఆపోజిట్ సెక్స్ వారితో జాగ్రత్తగా ఉండాలి. మీ బర్త్ నంబర్ 28 కాబట్టి మీ పేరును న్యూమరాలజీ ప్రకారం సరి చేసుకుని గ్రాఫాలజీ ప్రకారం సంతకం చేస్తే తొందరగా అదృష్టాన్ని అంది పుచ్చుకోవచ్చు. లక్కీ నంబర్స్: 1,2,5,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: శుక్ర, శని, ఆదివారాలు; సూచనలు: భృగుపాశుపత హోమం చేయించుకోవడం, అనాథలను ఆదుకోవడం, మదరసాలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకోవచ్చు.
- డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement