బంగారుకాంతికి...

Beauty tips: skin blow special  - Sakshi

బ్యూటిప్స్‌ 

పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్‌ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగులో ఉండే గుణాలు నలుపుగా మారిన చర్మాన్ని సాధారణ రంగులోకి తీసుకువస్తాయి. కొబ్బరి నూనె చర్మాన్ని మరింత  మృదువుగా మారుస్తుంది. ∙టీ స్పూన్‌ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.

పొడిచర్మాన్ని ఈ మాస్క్‌ మృదువుగా మారుస్తుంది.∙టేబుల్‌ స్పూన్‌ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్‌ చేసి, ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. మెడకు, గొంతుకు కూడా రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా అవుతుంది. చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. పెరుగులో పెసరపిండి కలిపి రెండు రోజులు బయటే ఉంచాలి. తర్వాత రోజు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకలకు మంచి కండిషనింగ్‌ లభించి మృదువు అవుతాయి. టీ స్పూన్‌ పెసరపిండిలో తగినంత పెరుగు కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువవుతుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top