ఆటో అన్న

Auto Driver Helps Injured Street Dogs And Animals in Tamil nadu - Sakshi

భాస్కర్‌ ఆటో నడుపుతాడు. చెన్నై అతడిది. ఆటోలో ఎప్పుడూ రగ్గులు, డెట్టాలు, ఫినాయిలు, శానిటైజర్‌లు, మాస్కులు, గ్లవుజులు, ఏప్రాను ఉంటాయి. ప్యాసింజర్‌లు మాత్రం ఉండరు! వారికి బదులుగా గాయపడిన వీధి శునకాలు, ఇతర స్ట్రీటీలు ఉంటాయి. ముందుగా వాటికి తను ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి, వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళతాడు. ట్రీట్‌మెంట్‌ అయ్యాక, తనకు వాటి గురించి ఎవరైతే సమాచారం అందించారో వాళ్లకు భద్రంగా అందజేస్తాడు. మైలాపుర్‌లో ఏడేళ్లుగా ఆటో నడుపుతున్నాడు భాస్కర్‌. మూడేళ్ల నుంచి అతడు ఆటో అన్న అయ్యాడు.

మూగ జీవులకు దెబ్బలు తగిలినా, రక్తం కారుతున్న గాయాలతో అవి మూలుగుతూ ఉన్నా వెంటనే భాస్కర్‌ అన్నకు ఫోన్‌ వెళుతుంది. మూడేళ్ల క్రితం తారసపడిన వినోదినీ మేడమ్‌ను చూసి అతడు తన ప్రయాణ మార్గం మార్చుకున్నాడు. వినోదిని యానిమల్‌ వెల్ఫేర్‌ యాక్టివిస్ట్‌. ఆవిడ ద్వారా మరికొంత మంది కార్యకర్తలకు భాస్కర్‌ పరిచయం అయ్యాడు. అలా స్ట్రీటీ లకు ఫుల్‌ టైమ్‌ వన్నాట్‌ ఎయిట్‌ అయ్యాడు. 42 ఏళ్ల భాస్కర్‌ కు ఇద్దరు కొడుకులు. ఇంటర్‌ ఒకరు. టెన్త్‌ ఒకరు. భార్య రెండిళ్లలో కుక్‌. ఎక్కువ భాగం ఆమెదే ఇంటి పోషణ. భర్త జంతు సంరక్షణ ‘ఉద్యోగ’ బాధ్యతల్ని ఆమె అర్ధం చేసుకున్నట్లే ఉంది. సాయంత్రానికి అతడెంత చేతిలో పెడితే అంత.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top