మీరే పరిష్కరించుకుంటున్నారా?

మీరే పరిష్కరించుకుంటున్నారా?


సెల్ఫ్‌ చెక్‌



‘‘మా అమ్మాయి ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలదు. అవి ఆఫీస్‌కు సంబంధించినవైనా సరే... జీవితానికి సంబంధించినవైనా సరే’’ ఇలాంటి ఈక్వేషన్‌ మీకూ వర్తిస్తుందా? మనసమస్యలను మనమే పరిష్కరించుకోగలిగే సామర్థ్యం అవసరం. చిన్నచిన్న విషయాలకు పక్కవారిపై ఆధార పడటం అనవసరమే. ఎంత పెద్ద సమస్యలైనా ఓర్పుతో, సమన్వయంతో పరిష్కరించుకోవచ్చు. మీలో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ సామర్థ్యం ఉందో లేదో చెక్‌ చేసుకోండి.



1.    సవుస్య దేనివల్ల కలుగుతుంది? ఎవరివల్ల? ఎప్పటినుంచి? అని గుర్తించగలరు.

    ఎ. అవును      బి. కాదు  



2.    సమస్యలను వాటి పరిష్కారాలను ఒక పేపర్‌పై రాసుకొనే అలవాటు మీకుంది.

    ఎ. అవును      బి. కాదు  



3.    గుర్తించిన సవుస్యల్లో వుుఖ్యమైనది, ఎక్కువగా ఇబ్బంది పెట్టేదాన్ని ముందుగా పరిష్కరించటానికి ప్రయత్నిస్తారు.

    ఎ. అవును      బి. కాదు

 

4.    మీలో ఆశావహదృక్పథం ఎక్కువ, ప్రతి సవుస్యకు వూర్గం ఉందని నవు్ముతారు.

    ఎ. అవును      బి. కాదు

 

5.    ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ కోసం ప్రత్యామ్నాయ వూర్గాలను ఎన్నుకుంటారు.

    ఎ. అవును      బి. కాదు  



6.    విజయసాధనలో పొరపాట్లు, అపజయాలు సాధారణమని మీకు తెలుసు. స్ఫూర్తినిచ్చే పుస్తకాలను చదువుతారు.

    ఎ. అవును      బి. కాదు  



7.    చుట్టూ సమస్యలు ఉన్నా మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామాలు చేస్తూ నవ్వుతూ రోజు గడిపేస్తారు.

    ఎ. అవును      బి. కాదు

 

8. మీరు ఫాలో అయిన పరిష్కారమార్గం, ఫలితాన్ని ఒక సారి విశ్లేషించుకుంటారు.

    ఎ. అవును      బి. కాదు  



‘ఎ’ సమాధానాలు 6 దాటితే మీలో సమస్యపరిష్కార సామర్థ్యం పూర్తిస్థాయిలో ఉన్నట్లు. కష్టాల్లో, సమస్యల్లో దిగులు పడకుండా విజయాలే లక్ష్యంగా ముందుకు వెళతారు. ‘బి’ సమాధానాలు ఎక్కువైతే మీలో ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ టెక్నిక్‌ లేనట్లే. సమస్యలను చూసి దూరంగా వెళ్లే మనస్తత్వం ఉండవచ్చు. దీనివల్ల సమస్యలొచ్చినప్పుడు చికాకుగా, ఆందోళనగా అందరిపై కోపంతో ఉంటారు. సమస్యా పరిష్కార పద్ధతి అంత సులువైంది కాక పోయినా చిన్నగా దాన్ని పొందటానికి ప్రయత్నించాలి. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా భావించి ఆ పద్ధతులు ఫాలో అవ్వటానికి ప్రయత్నించండి. ఆల్‌ ద బెస్ట్‌...

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top