18న తాడేపల్లిగూడెంలో సిరిధాన్యాలు, ఔషధ మొక్కలపై సదస్సు

18th Conference on Medicinal Plants in Tadipalligududem - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, లయన్స్‌క్లబ్‌ సేంద్రియ సేద్య విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని మాగంటి సీతారామదాసు–లలితాంబ కల్యాణ మండపంలో ఈ నెల 18న ఉ. 10 గం.కు సిరిధాన్యాల ఆహారం విశిష్టతపై మిల్లెట్స్‌ రాంబాబు ప్రసంగిస్తారు. మహిళలతో వంటకాలు చేయిస్తారు. కలుపు మొక్కల్లో ఔషధ మొక్కలను గుర్తించడంపై దాట్ల సుబ్బరాజు ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు రామకృష్ణంరాజు, ప్రకృతి వ్యవసాయదారుడు సుబ్రహ్మణ్యంరాజు, లయన్స్‌ క్లబ్‌ సేంద్రియ సేద్య విభాగాధ్యక్షులు డా. పి.బి. ప్రతాప్‌కుమార్‌(94401 24253) ప్రసంగిస్తారు.

18న గుంటూరులో సమీకృత సహజ సేద్యంపై నారాయణరెడ్డి ప్రసంగం
రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 18 ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌ 5వ లైన్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బాలాజీ మండపంలో గో–ఆధారిత సమీకృత సహజ సేద్యంపై  గో–ఆధారిత సమీకృత సహజ సేద్య నిపుణులు ఎల్‌. నారాయణరెడ్డి(కర్ణాటక) శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 70939 73999.
 18న సేంద్రియ పుట్టగొడుగులపై శిక్షణ: గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఈనెల 18న ఉ. 10 గం.ల నుంచి సేంద్రియ పుట్టగొడుగుల పెంపక విధానంపై కొప్పుల శ్రీలక్ష్మి( రాజమండ్రి) శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 83675 35439.

14న విజయవాడలో సిరిధాన్యాల సాగు–ప్రయోజనాలపై సదస్సు
మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈనెల 14న విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల సెమినార్‌ హాల్‌లో సిరిధాన్యాలపై అవగాహన సదస్సు, సిరిధాన్యాల మేళా జరగనుంది. రసాయనాల్లేకుండా సిరిధాన్యాలను సాగు చేయటంపై ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్‌ ప్రసంగిస్తారు. సిరిధాన్యాల ప్రయోజనాలపై వీరమాచనేని రామకృష్ణ, పమ్మి సత్యనారాయణశాస్త్రి, కళ్యాణి, పద్మజ ప్రసంగిస్తారని నిర్వాహకులు జీవీ రావు (జీవామృతం)– 96180 00399

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top