'పశ్చిమ'లో 15 అసెంబ్లీ స్థానాలు మావే: వంకా | ysr congress to win 15 assembly seats in westgodavari district | Sakshi
Sakshi News home page

'పశ్చిమ'లో 15 అసెంబ్లీ స్థానాలు మావే: వంకా

May 8 2014 7:45 PM | Updated on Aug 14 2018 4:24 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో తమ పార్టీ రెండు లోక్సభ స్థానాలనూ గెలుచుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి వంకా రవీంద్రనాథ్‌ దీమా వ్యక్తం చేశారు.

నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో తమ పార్టీ రెండు లోక్సభ స్థానాలనూ గెలుచుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి వంకా రవీంద్రనాథ్‌ దీమా వ్యక్తం చేశారు. జిల్లాల్లో 15 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే లంక గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామిచ్చారు. తీర ప్రాంతంలోని మత్స్యకారుల అభ్యున్నతికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తారని చెప్పారు. నర్సాపురంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం వైఎస్‌ఆర్‌ సీపీ ద్వారానే సాధ్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement