సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీకి 112 అసెంబ్లీ సీట్లు: సర్వే | ysr congress party to get 112 assembly seats in seemandhra, aara survey reveal | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీకి 112 అసెంబ్లీ సీట్లు: సర్వే

Apr 21 2014 9:20 AM | Updated on Aug 14 2018 4:21 PM

సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీకి 112 అసెంబ్లీ సీట్లు: సర్వే - Sakshi

సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీకి 112 అసెంబ్లీ సీట్లు: సర్వే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 105 నుంచి 112 అసెంబ్లీ సీట్లు వస్తాయని తాజాగా నిర్వహించిన ఆరా సర్వేలో తేలింది.

హైదరాబాద్:  సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీదే హవా అని 'ఆరా' సర్వే వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 105 నుంచి 112 అసెంబ్లీ సీట్లు వస్తాయని తాజాగా నిర్వహించిన ఆరా సర్వేలో తేలింది. 15 నుంచి18 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని వెల్లడైంది. టీడీపీ-బీజేపీ కూటమికి 55 నుంచి 65 అసెంబ్లీ సీట్లు, 7 నుంచి 10 ఎంపీ సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. కాంగ్రెస్, ఇండిపెండెంట్లకు 10 నుంచి 15 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు వచ్చే దక్కే అవకాశముందని సర్వే వెల్లడించింది.

తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశముందని పేర్కొంది. టీఆర్‌ఎస్‌కు 52 నుంచి 57 అసెంబ్లీ సీట్లు, 7 నుంచి 9 ఎంపీ సీట్లు వచ్చే అవకాశముంది. కాంగ్రెస్- సీపీఐ కూటమికి 43 నుంచి 45 అసెంబ్లీ సీట్లు, 4 నుంచి 6 ఎంపీ సీట్లు దక్కనున్నాయని తెలిపింది. టీడీపీ- బీజేపీ కూటమికి 12 నుంచి16 అసెంబ్లీ సీట్లు 2 నుంచి 3 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడించింది. వైఎస్‌ఆర్‌సీపీకి 3 నుంచి 6 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు దక్కేఅవకాశముంది. ఎంఐఎంకు 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లు, 1 నుంచి 2 ఎంపీ సీట్లు వస్తాయని  'ఆరా' సర్వే వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement