వైఎస్సార్ రైతు పక్షపాతి: విజయమ్మ | ys rajasekhara reddy farmer protector, says vijayamma | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ రైతు పక్షపాతి: విజయమ్మ

Mar 28 2014 12:18 PM | Updated on Sep 2 2017 5:18 AM

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల పక్షపాతి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు.

ఎర్రగుంట: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల పక్షపాతి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత వైఎస్సార్దే అన్నారు. వైఎస్సార్ హయాంలో ఏ ఒక్క ఛార్జీ కూడా పెరగలేదని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో నిర్వహించిన రోడ్ షో లో విజయమ్మ ప్రసంగించారు.

పిల్లల చదువు కోసం 'అమ్మఒడి పథకం'పై జగన్‌బాబు మొదటి సంతకం చేస్తారని చెప్పారు. అవ్వా, తాతలకు రూ.700 పింఛన్‌, వికలాంగులకు రూ.1000 పింఛన్‌పై జగన్‌బాబు రెండో సంతకం చేస్తారని హామీయిచ్చారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుపై మూడోసంతకం చేస్తారన్నారు. డ్వాక్రా రుణాల మాఫీపై నాలుగో సంతకం, పల్లె పాలనపై జగన్‌బాబు ఐదో సంతకం చేస్తారని వైఎస్ విజయమ్మ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement