'సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు' | YS Jagan Mohan Reddy to sworn as chief minister, says Mekapati Rajamohan Reddy | Sakshi
Sakshi News home page

'సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు'

Apr 21 2014 1:15 PM | Updated on Aug 14 2018 4:21 PM

'సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు' - Sakshi

'సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు'

ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.

కందుకూరు: ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో చేపట్టిన ‘ వైఎస్సార్ జనభేరి’లో మేకపాటి ప్రసంగించారు.

సీమాంధ్రలోని అన్నిస్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ తమ పార్టీ సత్తా చాటుతుందని చెప్పారు. మహబుబాబాద్, ఖమ్మం, మల్కాజ్ గిరి ఎంపీ స్థానాలను వైఎస్ఆర్ సీపీ గెల్చుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ వైఎస్ జగన్ ముఖ్య భూమిక పోషించబోతున్నారని మేకపాటి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement