బాబు పర్యటనతో నేడు ట్రాఫిక్ మళ్లింపు | today's Traffic diversion from tour with chandrababu | Sakshi
Sakshi News home page

బాబు పర్యటనతో నేడు ట్రాఫిక్ మళ్లింపు

Apr 7 2014 3:06 AM | Updated on Oct 3 2018 7:31 PM

రాష్ట్ర మాజీ మఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా కడప నగరంలో డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ మళ్లింపునకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.

 కడప అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర మాజీ మఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా కడప నగరంలో డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ మళ్లింపునకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ స్టేడియంలో నేడు ప్రజాగర్జన బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.

 

కమలాపురం, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల నుంచి వచ్చే టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తమ వాహనాలను బిల్టప్ సమీపంలోని పుత్తా గార్డెన్స్, ఈద్గామైదానం వద్ద పార్కింగ్ చేసి కాలినడకన మున్సిపల్ స్టేడియంకు చేరుకోవాల్సి ఉంటుందని డీఎస్పీ ఆదేశించారు.

రాజంపేట, బద్వేలు, రైల్వేకోడూరు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు బైపాస్ ద్వారా దేవునికడప మీదుగా మార్కెట్‌యార్డుకు చేరుకుని అక్కడ వాహనాలు నిలుపాలని సూచించారు. రాయచోటి నియోజకవర్గం నుంచి వచ్చేవారు రైల్వేగేటు ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేసుకోవాలన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement