బీజేపీ స్థానాల్లో టీడీపీ నేతల నామినేషన్లు | tdp leaders files nominations as candidate of BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ స్థానాల్లో టీడీపీ నేతల నామినేషన్లు

Apr 18 2014 10:57 AM | Updated on Mar 29 2019 9:00 PM

ఓవైపు బీజేపీతో పొత్తులపై చర్చలు జరుపుతూనే మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు.

ఏలూరు : ఓవైపు బీజేపీతో పొత్తులపై చర్చలు జరుపుతూనే మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు. బీజేపీ స్థానాల్లో టీడీపీ నేతలు నామినేషన్లు వేస్తున్నారు. నర్సాపురం లోక్సభ స్థానానికి రఘురామ కృష్ణంరాజు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఒక సెట్ నామినేషన్ బీజేపీ తరపున...మరో సెట్ నామినేషన్ను బీజేపీ తరపున ఆయన సమర్పించారు.

ఇక తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానానికి కొట్టు సత్యనారాయణ మూడు సెట్ల నామినేషన్లు వేశారు. ఒక సెట్ ఇండిపెండెంట్గా, రెండో సెట్ బీజేపీ తరపున, మూడో సెట్ టీడీపీ తరపున నామినేషన్ వేశారు. చంద్రబాబు నాయుడు సూచనలతోనే వీరు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement