శరద్ యాదవ్ ను అడ్డుకున్ననితీష్ మద్దతుదారులు | Sharad Yadav faces ire of Nitish supporters | Sakshi
Sakshi News home page

శరద్ యాదవ్ ను అడ్డుకున్ననితీష్ మద్దతుదారులు

May 18 2014 3:24 PM | Updated on Sep 2 2017 7:31 AM

బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ రాజీనామా ఉపసంహరించుకుని తిరిగి ఆ పదవిలో కొనసాగాలని ఆ పార్టీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.

పాట్నా:బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ రాజీనామా ఉపసంహరించుకుని తిరిగి ఆ పదవిలో కొనసాగాలని ఆ పార్టీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ను నిలదీశారు.  నితీశ్ కుమార్ రాజీనామాను వెనక్కు తీసుకుని ముఖ్యమంత్రి కొనసాగాలని వారు డిమాండ్ చేశారు. నితీశ్ కుమార్ తో సమావేశమైయ్యేందుకు వెళ్లిన శరద్ యాదవ్ కారును అడ్డగించిన కార్యకర్తలు ఘోరవ్ చేశారు.

 

 జేడీయే పార్టీ సమావేశం ఆదివారం సాయంత్రం 4 గం.లకు జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి కొత్త సీఎంను ఏర్పాటు చేసే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. తమ పార్టీ ఆధ్వర్యంలోనే కొత్త సర్కారు ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో జేడీయూ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ గడవు 2015 నవంబరు వరకు ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement