హామీలు గుప్పిస్తున్న జయప్రద | RLD candidate Jaya Prada files her nomination papers in Bijnor | Sakshi
Sakshi News home page

హామీలు గుప్పిస్తున్న జయప్రద

Mar 22 2014 11:16 AM | Updated on Sep 2 2017 5:01 AM

హామీలు గుప్పిస్తున్న జయప్రద

హామీలు గుప్పిస్తున్న జయప్రద

అమ్మకు అన్నం పెట్టలేదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట వెనకటికి ఒకడు.

అమ్మకు అన్నం పెట్టలేదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట వెనకటికి ఒకడు. ఆర్‌ఎల్డీ నేత, సినీనటి జయప్రద మాటలు అలాగే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకు తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి చేసిందేమీ లేకున్నా కొత్త నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానంటూ హామీలు గుప్పించేస్తున్నారు.

సమాజ్‌వాదీకి చెల్లుచీటీ ఇచ్చి ఇటీవలి ఆర్ఎల్డీలో చేరిన జయప్రద.... లోక్‌సభ ఎన్నికల్లో బిజ్నూర్ నుంచి బరిలో దిగుతున్నారు. ఇప్పటి వరకు తాను ప్రాతినిధ్యం వహించిన రాంపూర్‌లో ఓటమి ఖాయమనే భావనతోనే ఆమె బిజ్నూర్‌ నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను జయప్రద ఖాతరు చేయడం లేదు. బిజ్నూర్ నుంచి నామినేషన్ వేసిన ఆమె పొత్తులో భాగంగానే తాను ఇక్కడి పోటీ చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. శుక్రవారం జయప్రద నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement