'మా తుపాకులు మీకివ్వం' | Punjabis refuse to surrender guns | Sakshi
Sakshi News home page

'మా తుపాకులు మీకివ్వం'

Mar 27 2014 11:33 AM | Updated on Aug 21 2018 3:16 PM

'మా తుపాకులు మీకివ్వం' - Sakshi

'మా తుపాకులు మీకివ్వం'

పంజాబ్ ఓటర్లు 'మా తుపాకులను సరండర్ చేసేది లేదు' అని కుండ బద్దలుగొట్టేస్తున్నారు.

మామూలుగా ఎన్నికల వేళ పౌరుల దగ్గరుండే ఆయుధాలను ప్రభుత్వం వద్ద జమ చేయాల్సి ఉంటుంది. దేశమంతా ఇదే జరుగుతుంది. కానీ పంజాబ్ లో మాత్రం 'మా తుపాకులను సరండర్ చేసేది లేదు' అని కుండ బద్దలుగొట్టేస్తున్నారు.


పంజాబ్ లో మొత్తం 2.86 లక్షల లైసెన్స్ ఆయుధాలున్నాయి. వీరంతా మార్చి 19 లోపు తమ తమ ఆయుధాలను జమచేయాలి. కానీ ఇప్పటి వరకూ కేవలం 1.03 లక్ష తుపాకులను మాత్రమే జమ చేశారు. తుపాకులు కేవలం మగవారి దగ్గరే కాదు, స్త్రీల దగ్గర కూడా ఉన్నాయి. పంజాబ్ లో 31,344 మంది మహిళలకు గన్ లైసెన్స్ ఉంది.


లైసెన్స్డ్ ఆయుధాలు ఎక్కువగా పాటియాలా, లూఢియానాలలో ఉన్నాయి. ఒక్క లూఢియానా నగరంలోనే 17,348 ఆయుధాలున్నాయి. మోగా, ఫిరోజ్ పూర్, భటిండా జిల్లాల్లోనూ తుపాకుల సంఖ్య ఎక్కువే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement