కాంగ్రెస్ అభ్యర్థులకు కొరత లేదు
సీమాంధ్ర కాంగ్రెస్ జాబితా రెండు విడతలుగా వెలువడుతుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు.
హైదరాబాద్ : సీమాంధ్ర కాంగ్రెస్ జాబితా రెండు విడతలుగా వెలువడుతుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు దక్కుతాయని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కొరతలేదని.... అసెంబ్లీకి 1160, ఎంపీ సీట్లు కోసం 175మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారని రఘువీరా తెలిపారు.
టీడీపీ మేనిఫెస్టోకు విశ్వసనీయత ఉండదని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గత చరిత్ర అటువంటిదని రఘువీరా వ్యాఖ్యానించారు. బాబుకు ప్రజల మద్దతు లభించటం అంత సులువు కాదని ఆయన అన్నారు. అభ్యర్థుల ఖరారుపై బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు రఘువీరా తెలిపారు. అన్ని వర్గాలకు, యువతకు సమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.


