ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి అరెస్టు, విడుదల | pathipadu TDP Candidate arrested Release | Sakshi
Sakshi News home page

ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి అరెస్టు, విడుదల

May 5 2014 12:31 AM | Updated on Aug 20 2018 4:44 PM

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో ్ల ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావెల కిషోర్‌బాబును స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల ఒకటవ తేదీన ప్రత్తిపాడు

ప్రత్తిపాడు, న్యూస్‌లైన్: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో ్ల ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావెల కిషోర్‌బాబును స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల ఒకటవ తేదీన ప్రత్తిపాడు పంచాయతీ పరిధిలోని తూర్పుపాలెం చర్చి ఆవరణలో ప్రచారం చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. దీంతో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.రామమూర్తి ఆదేశాల మేరకు 2వ తేదీన వీఆర్వో స్థానిక పోలిస్ స్టేషనులో పిర్యాదు చేయగా అదేరోజు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆది వారం రావెల కిషోర్‌బాబును అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా, బెయిల్ మంజూరు చేసినట్లు ప్రత్తిపాడు ఎస్‌ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement