
పవన్‌కు మోడీ కృతజ్ఞతలు
ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం నిర్వహించినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా కృత జ్ఞతలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం నిర్వహించినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా కృత జ్ఞతలు తెలిపారు. ‘ప్రచారంలో మీరు చూపిన చొరవ, ఉత్సాహానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు. దీనికి పవన్ స్పందించారు. ఉన్నతాశయాలు ఉన్న మోడీ ప్రధాని అయ్యేందుకు తన వంతు ప్రయత్నం చేశానని, మోడీ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తారన్న నమ్మకం ఉందన్నారు.