మేడ్చల్ టికెట్ నాదే: లక్ష్మారెడ్డి | kichannagari laxma reddy file nomination to medchal constituency | Sakshi
Sakshi News home page

మేడ్చల్ టికెట్ నాదే: లక్ష్మారెడ్డి

Apr 4 2014 8:51 PM | Updated on Aug 14 2018 4:21 PM

మేడ్చల్ టికెట్ నాదే: లక్ష్మారెడ్డి - Sakshi

మేడ్చల్ టికెట్ నాదే: లక్ష్మారెడ్డి

మేడ్చల్ నియోజకవర్గ టికెట్ తనకే లభిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గ టికెట్ తనకే లభిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సిట్టింగ్‌లకే తిరిగి టికెట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. ఆ విశ్వాసంతోనే నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.

ఒకవేళ అధిష్టానం సిట్టింగ్‌లకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని, దాన్ని అరికట్టడానికి తనవంతుగా నామినేషన్ వేయడానికి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వచ్చినట్లు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement