భర్త మోడీతో, భార్య ములాయంతో' | Hubby with Modi, wife with Samajwadi party | Sakshi
Sakshi News home page

భర్త మోడీతో, భార్య ములాయంతో'

Mar 25 2014 12:36 PM | Updated on Mar 29 2019 9:18 PM

భర్త మోడీతో, భార్య ములాయంతో' - Sakshi

భర్త మోడీతో, భార్య ములాయంతో'

రాజకీయాలు ఎన్నెన్నో వింత కాంబినేషన్లకు దారితీస్తూంటాయి. భార్య భర్తపై, తండ్రి కొడుకుపై, అన్న తమ్ముడిపై పోటీచేయడం ఎన్నికల వేళ జరుగుతూంటాయి.

రాజకీయాలు ఎన్నెన్నో వింత కాంబినేషన్లకు దారితీస్తూంటాయి. భార్య భర్తపై, తండ్రి కొడుకుపై, అన్న తమ్ముడిపై పోటీచేయడం ఎన్నికల వేళ జరుగుతూంటాయి. ఇప్పుడు బిగ్ బి కుటుంబంలోనూ ఇలాంటి విచిత్రం కనిపిస్తోంది.


బిగ్ బి అమితాబ్ నరేంద్ర మోడీకి సన్నిహితుడు. ఆయన గుజరాత్ టూరిజంకి బ్రాండ్ ఎంబాసిడర్ కూడా. కానీ ఆయన భార్య జయా బచ్చన్ మాత్రం సమాజ్ వాదీ పార్టీ ఎంపీ.


అయితే అమితాబ్  ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. పార్టీ తీర్థం పుచ్చుకోలేదు. 1984 లో కొన్నాళ్లు ఎంపీగా ఉన్నాక ఆయన తనకు రాజకీయాలు పడవని గుర్తించి, తప్పుకున్నారు. అప్పట్నుంచీ ఆయన రాజకీయులతో సన్నిహితంగా ఉన్నా కండువాలు మాత్రం వేసుకోలేదు. జయా బచ్చన్ మాత్రం సమాజ్ వాదీ పార్టీ ఎంపీగా ఉన్నారు.


ఒకప్పటి బిగ్ బి కుటుంబ మిత్రుడు, రాజకీయ నేత అమర్ సింగ్ దీన్నే ఎత్తి చూపి, భర్త మోడీతో, భార్య ములాయంతో. వాహ్... క్యా ఫామిలీ హై' అని ఎద్దేవా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement