కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకర్‌రెడ్డి తనయుడి వీరంగం సృష్టించారు.
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకర్‌రెడ్డి తనయుడి వీరంగం సృష్టించారు. వైసీ పీఎం పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కుమార్‌రెడ్డిపై దాడి చేశారు. నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు.
గంగుల ప్రభాకర్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకువరకు ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటమి భయంతోనే గంగుల ప్రభాకర్ రెడ్డి దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.