మోడీ ఎన్‌కౌంటర్ సీఎం, అబద్ధాలకోరు | finance minister p chidambaram takes on narendra modi | Sakshi
Sakshi News home page

మోడీ ఎన్‌కౌంటర్ సీఎం, అబద్ధాలకోరు

Apr 18 2014 5:31 AM | Updated on Mar 29 2019 9:24 PM

మోడీ ఎన్‌కౌంటర్ సీఎం, అబద్ధాలకోరు - Sakshi

మోడీ ఎన్‌కౌంటర్ సీఎం, అబద్ధాలకోరు

కేంద్ర మంత్రి చిదంబరం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి.

 చెన్నై: కేంద్ర మంత్రి చిదంబరం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ  మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. చిదంబరం రీకౌంటింగ్ మంత్రి అన్న మోడీ వ్యాఖ్యలకు స్పందనగా.. మోడీ ఎన్‌కౌంటర్ సీఎం అని చిదంబరం వ్యాఖ్యానించారు.

ఓటర్లకు చిదంబరం తన ఫొటోతో కూడిన వాచీలు పంచుతున్నారని, దీనిపై ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని మోడీ డిమాండ్ చేయగా.. ఆయన కలల ప్రపంచంలో బతికే అబద్ధాలకోరు అంటూ చిదంబరం ఎదురుదాడి చేశారు. తన నియోజకవర్గం శివగంగలో రీకౌంటింగ్ జరగలేదన్న సంగతి మోడీకి తెలుసునని, అయినా ఆయన అబద్ధపు ప్రకటనలు చేస్తూనే ఉన్నారని గురువారమిక్కడ ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement