‘కోడ్’ పట్టని అధికారులు | elections code care less officers | Sakshi
Sakshi News home page

‘కోడ్’ పట్టని అధికారులు

Mar 25 2014 4:16 AM | Updated on Sep 2 2017 5:07 AM

ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నా క్షేత్రస్థాయిలో

న్యూస్‌లైన్ , దుత్తలూరు,ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నా  క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఎటువంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు ఉండకూడదని ఆదేశాలిచ్చారు. మండలంలో చాలా చోట్ల అటువంటి ఫ్లెక్సీలు, జెండాలు తొలగించినా ఇంకా కొన్నిచోట్ల ఇలాంటి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. నర్రవాడలో విద్యుత్ స్తంభానికి టీడీపీ జెండా, పోస్టర్లు వేలాడుతున్నాయి. వెంగనపాళెం పంచాయతీ కార్యాలయం గోడపై గతంలో ముద్రించిన రాజీవ్ యువకిరణాల బోర్డు ఇప్పటికీ అలాగే దర్శనమిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement