రైతుల పొట్టకొట్టిన చంద్రబాబు: కవిత | chandra babu naidu deceived farmers, says kavita | Sakshi
Sakshi News home page

రైతుల పొట్టకొట్టిన చంద్రబాబు: కవిత

Apr 10 2014 2:56 PM | Updated on Oct 17 2018 6:06 PM

రైతుల పొట్టకొట్టిన చంద్రబాబు: కవిత - Sakshi

రైతుల పొట్టకొట్టిన చంద్రబాబు: కవిత

నిజం షుగర్స్ను అమ్మేసిన ఘనత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకే దక్కుతుందని నిజామాబాద్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.

నిజం షుగర్స్ను అమ్మేసిన ఘనత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకే దక్కుతుందని నిజామాబాద్ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీని తానే కట్టించానని చెబుతున్న ఆయన, జిల్లాల్లో మాత్రం రైతుల పొట్ట కొట్టారని విమర్శించారు.

భారతీయ జనతా పార్టీ కాస్తా ఇప్పుడు చంద్రబాబు జేబులో పార్టీగా మారిపోయిందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పరాయి పాలకుల కిరాయి మనుషులుగా మారారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement