జగన్ స్వప్నాల సీమాంధ్ర రాజధాని ఎలా ఉండబోతోంది?

జగన్ స్వప్నాల సీమాంధ్ర రాజధాని ఎలా ఉండబోతోంది? - Sakshi


అవును... ఇప్పుడు సీమాంధ్ర కి కొత్త రాజధాని కావాలి. సీమాంధ్రప్రజల అవసరాలకు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన రాజధాని కావాలి. అత్యాధునిక రాజధాని కావాలి. దేశం మెచ్చే రాజధాని కావాలి. ఇందుకోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇది సీమాంధ్ర రాష్ట్రం అభివృద్ధి దశను, దిశను మార్చే రాజధానికాబోతుంది. అందులోని ముఖ్యాంశాలు ఇవి:* సురక్షిత రాజధాని: సీమాంధ్ర రాజధాని తుఫాన్లను తట్టుకునేలా ఉండాలి. అందుకే కీలక రాజధాని భవనాలు సురక్షితంగా ఉండటం అవసరం.


*  స్మార్ట్ రాజధాని: రాజధానిలో పర్యావరణాన్ని కాపాడేందుకు గ్రీన్ జోన్లు ఉంటాయి. ప్రతి టౌన్ షిప్ స్వయంసమృద్ధంగా ఉంటుంది. పిల్లలకు ఆనందాన్నిచ్చే రిక్రియేషన్ జోన్లు, విద్యా, వైద్య రంగ హబ్ లు, పట్టణాభివృద్ధికి వినూత్న మార్గాలను వెతికే ఇన్నొవేషన్ హబ్ లు ఈ రాజధానిలో ఉంటాయి.


*  పర్యావరణ ప్రియ రాజధాని: పాదచారుల కోసం వీలైనంత మేరకు అవకాశాలు. ఇంధన వాడకాన్ని తగ్గించేందుకు సైక్లింగ్ జోన్స్, దాదాపు వంద కమ్యూనిటీ పార్కులు, మొత్తం రాజధానిలో 60 వాతం హరిత వనాలు ఉండాలి. మెట్రో రైలు, సోలార్ లైటింగ్, వ్యర్థాల నిర్మూలన నిర్వహణ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన రవాణా, సురక్షితమైన నగర జీవనం ఇవ్వగలగాలి.


* ప్రపంచ ప్రఖ్యాతినిచ్చే రాజధాని: విధానసభ రాష్ట్ర సంస్కృతికి అద్దం పట్టాలి. వీటి ముందు బెంగుళూరు సచివాలయానికి, అసెంబ్లీకి ముందున్న కబ్బన్ పార్కు లాంటి పార్కును 500 ఎకరాల్లో విస్తరింపచేయాలి. అంతర్జాతీయంగా సీమాంధ్ర రాజధానికి గుర్తింపు తెచ్చేలా ఒక కట్టడం తయారు కావాలి. వాషింగ్టన్ లింకన్ మెమోరియల్, ముంబాయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా వంటి కట్టడంగా అది వికసించాలి.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top